Site icon HashtagU Telugu

Devineni Avinash : కాల్ మనీ కేసుల్లో ఉన్న బ‌ఫూన్ గాల్లు వైసీపీని విమ‌ర్శించ‌డం విడ్డూరం – దేవినేని అవినాష్

Bonda Vs Devineni Imresizer

Bonda Vs Devineni Imresizer

బెజ‌వాడ టీడీపీ నేత‌ల‌పై విజ‌య‌వాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మండిప‌డ్డారు. విజ‌య‌వాడ అభివృద్ధిపై టీడీపీ నేత‌లు చేసిన కామెంట్స్ పై అవినాష్ కౌంట‌ర్ ఇచ్చారు. నాలుగేళ్లుగా విజ‌య‌వాడ న‌గ‌రాన్ని అభివృద్ధి చేసిన ఘ‌న‌త సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిదేన‌ని ఆయ‌న అన్నారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా టీడీపీ లేవ‌దంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఈవినింగ్ వాక్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. విజయవాడ లో లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అవుతుందన్నారు. కాల్ మనీ కేసుల్లో ఉన్న భపూన్ గాల్లు వైసీపీని విమ‌ర్శించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. రూపాయి బిళ్ల కు పనికిరాని చిల్లర గాళ్లు వైసీపీని విమ‌ర్శిస్తే ప‌ట్టించుకోవాల్సిన అవసరం లేద‌న్నారు. త‌న‌ను బలిపశువును చేసింది టీడీపీనేన‌ని అంద‌రికి తెలుస‌ని.. త‌న‌ను సీఎం జగన్ అన్ని రకాలుగా ముందుకు తీసుకుని వెళ్తున్నారని అవినాష్ తెలిపారు.