Site icon HashtagU Telugu

Corona:విద్యార్థుల‌పై పంజా విసురుతున్న క‌రోనా.. కొత్త‌వ‌ల‌స ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో 19మందికి పాజిటివ్‌

విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా ప‌రిష‌త్‌ ఉన్నత పాఠశాలలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతుంది. ఈ పాఠ‌శాల్లో ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులకు కోవిడ్‌ సోకింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, త‌ల్లిదండ్ర‌లు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. సోమవారం పాఠశాలలో వైద్యబృందం స్వాబ్ పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసరావు తెలిపారు. ఒక ఉపాధ్యాయుడు, 19 మంది విద్యార్థులు కోవిడ్ బారిన ప‌డిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా.పి.సీతామహాలక్ష్మి పాఠశాలను సందర్శించి విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, క‌రోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చేతులు శుభ్రం చేసుకోవాల‌ని ఆమె సూచించారు. మరోవైపు, సోకిన విద్యార్థులందరూ ఇప్పటివరకు ఆరోగ్యంగా ఉన్నారు.. ఎటువటి లక్షణాలు లేవు. అయితే ముందుజాగ్రత్త చర్యగా అందరూ ఇంట్లోనే ఉండాలని, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.