YS Vijayamma: తెలంగాణ ఎన్నికల్లో విజయమ్మ పోటీ, ఎక్కడ్నుంచే అంటే!

కాగా తెలంగాణ ఎన్నికల బరిలో తన తల్లి విజయమ్మను నిలపాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం.

Published By: HashtagU Telugu Desk
YS Vijayamma Open Letter

YS Vijayamma Open Letter

YS Vijayamma: కాంగ్రెస్ త్ దోస్తీ కటీఫ్ కావడంతో వైఎస్ షర్మిల, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ 100 స్థానాల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయనుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇక గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేటలో నర్సింహారెడ్డి, సిరిసిల్లలో చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికల బరిలో నిలిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  కాగా తెలంగాణ ఎన్నికల బరిలో తన తల్లి విజయమ్మను నిలపాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. వైఎస్‌ షర్మిల పాలేరు, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనుండగా, ఆమె తల్లి వైఎస్ విజయమ్మ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.

  Last Updated: 12 Oct 2023, 01:59 PM IST