Kushi Title Song: ఖుషి సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్ రిలీజ్

విడుదలకు ముందే కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటివాటిలో విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు నటించిన ‘ఖుషి’ ఒకటి. భారీ అంచనాలు ఉన్న రొమాంటిక్ కామెడీ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రేక్షకులను ఆకర్షించ పనిలో పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన 3వ టైటిల్ ట్రాక్ విడుదలైంది. మూడో పాట కూడా మనసు దోచుకుంది. ఇందులో అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని రకీబ్ అందించారు. […]

Published By: HashtagU Telugu Desk
Kushi

Kushi

విడుదలకు ముందే కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటివాటిలో విజయ్ దేవరకొండ, సమంతా రూత్ ప్రభు నటించిన ‘ఖుషి’ ఒకటి. భారీ అంచనాలు ఉన్న రొమాంటిక్ కామెడీ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రేక్షకులను ఆకర్షించ పనిలో పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన 3వ టైటిల్ ట్రాక్ విడుదలైంది. మూడో పాట కూడా మనసు దోచుకుంది.

ఇందులో అబ్దుల్ వహాబ్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ పాటకు సాహిత్యాన్ని రకీబ్ అందించారు. ఇది శ్రోతల హృదయాలను కట్టిపడేసింది. ‘ఖుషి’ నుండి మొదటి సింగిల్, ‘తు మేరీ రోజా’, ఇప్పటికే ప్రేక్షకుల నుండి ఆదరణ పొందింది. రెండో సాంగ్ ఆరాధ్య కూడా యూట్యూబ్ లో అధిక వ్యూస్ తో దూసుకుపోతోంది. ప్రతిభావంతులైన శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ‘ఖుషి’ సెప్టెంబర్ 1, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

  Last Updated: 29 Jul 2023, 11:21 AM IST