2022: గోవాలో న్యూఇయర్ వేడుకలు.. విజయ్, రష్మిక ‘చిల్’

నేషనల్ క్రష్ రష్మిక, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు.

Published By: HashtagU Telugu Desk

నేషనల్ క్రష్ రష్మిక, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నారు. ఇద్దరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. గతకొన్నిరోజుల క్రితమే ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టింది ఈ జంట. న్యూఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో ఈ జంట గోవాకు పయనమయ్యారు. ఇప్పటికే సమంత బీచ్ లో ఎంజాయ్ చేస్తుండగా, ఈ జంట న్యూ ఇయర్ వేడులకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ, రష్మిక, విజయ్ దేవరకొండ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని బహిర్గతం చేశారు.

వీరిద్దరూ కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ అనే రెండు చిత్రాల్లో నటించారు. ఇటీవల విజయ్, రష్మిక మందన్న కలిసి ముంబై పోస్ట్ డిన్నర్‌లో ఒకే కారులో బయలుదేరారు. తరచుగా ముంబైలో కలుసుకుంటారు. హైదరాబాద్‌లో ఒకే జిమ్‌కు వెళతారు. ఈ జంట రెగ్యులర్ గా మీట్ అవుతుండటంతో డేటింగ్ లో ఉన్నారనే వార్తలకు ఆజ్యం పోసినట్టయింది.

  Last Updated: 31 Dec 2021, 05:28 PM IST