Site icon HashtagU Telugu

Leo: ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్.. థియేటర్ లో అభిమాన జంట ఎగేంజ్ మెంట్

Thalapathi Vijay Leo Review & Rating

Thalapathi Vijay Leo Review & Rating

Leo: తమిళ్ సూపర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానుల సంఖ్యతో థియేటర్లలో సందడి నెలకొంటుంది. తాజాగా ద‌ళ‌ప‌తి విజ‌య్ చిత్రం లియో రిలీజై థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తుంది. ఫేవ‌రేట్ హీరో సినిమా మొద‌టిరోజు ఎవ‌రైనా చూస్తారు. కానీ ఓ అభిమాని మాత్రం కాస్త కొత్తగా ఆలోచించాడు. లియో థియేట‌ర్లో ఏకంగా త‌న కాబోయే భార్య‌ను తీసుకొచ్చి దండ‌లు మార్చుకున్నారు.

ఉంగ‌రాలు మార్చుకున్నారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ జంట త‌మిళనాడులోని పుదుకుట్టే జిల్లాకు చెందిన‌వారు. వెంక‌టేష్‌, మంజుష అనే వీరికి ద‌ళ‌ప‌తి విజ‌య్ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే థియేటర్‌లో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.