Vijay Antony Daughter Sucide: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ కూతురు సూసైడ్

బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో కూతురు మీరా (16) చెన్నై అల్వార్ పేటలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య (Vijay Antony Daughter Sucide) చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Vijay Antony Daughter Sucide

Compressjpeg.online 1280x720 Image 11zon (1)

Vijay Antony Daughter Sucide: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో కూతురు మీరా (16) చెన్నై అల్వార్ పేటలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య (Vijay Antony Daughter Sucide) చేసుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగా లారా ప్రాణాలు విడిచింది. బిచ్చగాడు మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య చేసుకుంది. విజయ్ ఆంటోని కూతురు మీరా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మీరా 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని చర్చి పార్క్ స్కూల్‌లో చదువుతోంది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

Also Read: Chandrayaan Ganapathi : ‘చంద్రయాన్-3’ గణపతుల సందడి.. ఫొటోలు వైరల్

ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసిన వెంటనే దగ్గరలోని కావేరి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లుగా సమాచారం. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మీరా ఆత్మహత్యకు కారణం ఏంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఒత్తిడి కారణంగా మీరా చనిపోయి ఉండవచ్చని విజయ్ సన్నిహితులు అంటున్నారు. కూతురు మృతితో విజయ్ ఆంటోని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

  Last Updated: 19 Sep 2023, 07:30 AM IST