Site icon HashtagU Telugu

Dancing Cop: ఈ ట్రాఫిక్ పోలీసు డ్యాన్సుకు జనాలు ఫిదా..!!

Dancing Cop

Dancing Cop

పోలీసులంటే ఎప్పుడూ డ్యూటీ చేస్తూ…దొంగలమీద జులం చేసేవారుగానే చూస్తుంటాం. ఇక ట్రాఫిక్ పోలీసులంటే…వాహనాలను ఆపడం, చెక్ చేయడం..స్పీడ్ గా వెళ్తే కెమెరా క్లిక్ అనిపించి…ఇంటికి చలాన్లు పంపించడం ఇవే అనుకుంటాం. కానీ ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమితాబ్ బచ్చన్ పాటైన జాను మేరి జాన్ కు పాటకు డ్యాన్స్ ఇరగదీశారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు దాదాపు 5వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో ఒక వ్యక్తి జాను మేరి జాను పాటకు డ్యాన్స్ చేస్తున్నప్పుడు…ఎంతో సంతోషంగా ట్రాఫిక్ పోలీస్ అతనితోపాటు రోడ్డుపై డ్యాన్స్ చేశాడు. పబ్లిక్ పోలీస్ స్నేహానికి ఇది చక్కటి ఉదాహరణ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.