Site icon HashtagU Telugu

Bison Rams Auto:ఆటో అదిరిపోయేలా అడవి దున్న ఎటాక్.. బ్రహ్మాస్త్ర మూవీ సీన్ ను తలపించే వీడియో వైరల్!!

Bison

Bison

వన్య ప్రాణులను డిస్టర్బ్ చేశామో.. వార్ వన్ సైడ్ అయిపోతుంది.

అవి రెచ్చిపోయి మనుషులపై దండయాత్రకు దిగాయో తట్టుకోలేని పరిస్థితి ఎదురవుతుంది.

ఇందుకు అద్దం పట్టే ఒక ఘటన ఇటీవల చోటుచేసుకుంది. కొమ్ములు తిరిగిన ఒక అడవి దున్న ఏకంగా ఆటోను ఢీకొట్టింది. దాని దెబ్బ ధాటికి ఆటో బోల్తా పడేంత పరిస్థితి ఏర్పడింది. అడవి దున్న దెబ్బా మజాకా!!

WildLense Eco Foundation (@WildLense_India) అనే ట్విట్టర్ అకౌంట్ నిర్వాహకులు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా ఆటో బోల్తా పడేంత బలంగా అడవి దున్నపోతు ఢీకొట్టడం నెటిజన్స్ ను అబ్బురపరుస్తోంది. వందల కిలోల బరువున్న ప్రయాణికులు కూర్చున్న ఆటోబోల్తా పడేంత ధాటిగా దున్నపోతు తలతో గుద్దడం పై నెటిజన్స్ మధ్య హాట్ డిబేట్ జరుగుతోంది. “నంది అస్త్రం ఎటాక్ అదిరింది. బ్రహ్మాస్త్ర మూవీలోని నంది అస్త్రాన్ని రియల్ గా చూసే అవకాశం దక్కింది” అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.

జ్ఞాపకం నెమరువేసుకున్నాడు..

మరో వ్యక్తి తనకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎదురైన ఒక ఘటనను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశాడు. “అది నా చిన్నప్పటి జ్ఞాపకం.
నేను మా మామయ్యతో కలిసి నాగర్ హోల్ అడవి మీదుగా జీపులో వెళ్తున్నాను. దారి మధ్యలో అడవి దున్నల గుంపు కూర్చొని ఉంది. మా జీపు అక్కడికి వెళ్లి ఆగగానే ఒక అడవి దున్న ఆవేశంగా పరుగెత్తి వచ్చి.. మా జీపును ఢీకొట్టింది. ఆ దెబ్బకు మా జీపు రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోయింది. అదృష్టవశాత్తు ఆ ఘటనలో మేం ప్రాణాలతో బయటపడ్డాం. ఆ తర్వాత అక్కడున్న ఫారెస్ట్ అధికారులు మాకు ప్రాథమిక చికిత్స చేశారు. జీపుకు హెడ్ లైట్స్ ఉండటం వల్ల.. వాటిని చూసి కోపంతో ఊగిపోయి అడవి దున్న దాడిచేసిందని చెప్పారు. వాహనాల లైట్స్ అంటే అడవి దున్నలకు కోపం అని తెలిపారు” అని ఆ నెటిజన్ వివరించాడు.

800 కిలోగ్రాములు..

అన్నట్టు.. ఒక్కో అడవి దున్నపోతు బరువు దాదాపు 800 కిలోగ్రాముల దాకా ఉంటుంది. మధ్యప్రదేశ్ లోని పశ్చిమ కనుమలు, బందీపూర్, వయనాడ్,మధు మలై వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అడవి దున్నపోతులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి.