Site icon HashtagU Telugu

Viral Video: పోలీసును చితక్కొట్టిన వ్యక్తి…వీడియో వైరల్..!!

Police Assualt

Police Assualt

మధ్యప్రదేశ్ ఇండోర్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అంతాచూస్తుండగానే పోలీసు నుంచి లాఠీ లాక్కొన్న ఓ వ్యక్తి…ఆయన్ను చితక్కొట్టాడు. వెంబడించి మరీ కొట్టాడు. ఈ ఘటన ఇండోర్ లో జరిగింది. వెంకటేశ్ నగర్ ప్రాంతంలో శుక్రవారం 25ఏళ్ల దినేశ్ ప్రజాపతి…పోలీసు కానిస్టేబుల జై ప్రకాశ్ జైస్వాల్ బైకులు రెండూ స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారిద్దరూ కూడా కిందపడిపోయారు. ఈ ప్రమాదంపై ఆగ్రహించిన దినేశ్, కానిస్టేబుల్ జైస్వాల్ నుంచి లాఠీ లాక్కొన్నాడు. ఆయనపై దాడి చేశాడు. పైకి లేచి వెళ్తున్న పోలీసును వెంబడించి మరీ చితకబాదాడు. పోలీసును కొడుతుంటే అక్కడున్నవారు చూస్తూ ఉండిపోయారే తప్పా…కానిస్టేబుల్ ను కాపాడేందుకు ముందుకు రాలేదు.

ఈ ఘటనలో గాయపడిన పోలీసు కానిస్టేబుల జై ప్రకాశ్ జైస్వాల్ ఫిర్యాదు చేశారు. పోలీసులు దినేశ్ ప్రజాపతిని అరెస్టు చేసి…పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనను కొందరు స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.