దీపావళి (Diwali Celebrations) ఎంత సంతోషంగా జరుపుకోవాలని అనుకున్న..జాగ్రత్తలు తీసుకోకపోతే పెను ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ప్రతి ఏడాది దీవాలి కి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు చెపుతూనే ఉంటారు. క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని చెప్పినప్పటికీ..చాలామంది అవేమి పట్టిటించుకోకుండా ఏరికోరి ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటుంటారు. ఇక ఈ ఏడాది కూడా అలాగే జరిగింది.
దీపావళి వేళ కాల్చిన క్రాకర్స్ వల్ల చాలామందికి కంటి సమస్యలు మొదలయ్యాయి. దీంతో హైదరాబాద్లోని సరోజినీదేవి ఆసుపత్రి (Sarojini Devi Hospital)కి బాణసంచా బాధితులు క్యూ పెరిగిపోతుంది. బాధితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా 100 బెడ్లు ఏర్పాటు చేసింది యాజమాన్యం. ఇప్పటి వరకు 50 మందికి చికిత్స అందించినట్లు వైద్యులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ కొందరికి సర్జరీ అవసరం అని సూచించినట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది కి పొగ మరియు రసాయనాల వల్ల కళ్లలో కాల్చినట్టుగా, గారడిగా అనిపించడం. రసాయనాలు కళ్లను గందరగోళపరిచే లోపలకి చేరడం వల్ల చీము లేదా నీరు కారడం. పొగతో వచ్చే పొడిబారీలు కళ్లలో అలర్జీ రియాక్షన్ లు కలిగించడం. ఫటాకుల సమీపంలో ఉంటే సడన్ స్పార్క్ లేదా క్రాకర్స్ వల్ల గాయాలు కావడం వంటి సమస్యలతో చేరినట్లు డాక్టర్స్ పేర్కొన్నారు.
Read Also : NTR : ‘దేవర’ సక్సెస్ తర్వాత ఫ్యామిలీతో ఎన్టీఆర్ దీపావళి.. అభయ్ రామ్ ఎంత పెద్దోడు అయ్యాడో..