భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడుకు ఆదివారం కరోనా వైరస్ (కోవిడ్-19) సోకింది. రిపబ్లిక్ వేడుకల కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఆయన కొవిడ్ టెస్టు చేసుకున్నారు. టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వారంరోజుల పాటు హోంక్వారంటైన్ లోకి ఉండనున్నట్టు, తనను కలిసినవాళంతా టెస్టులు చేసుకోవాలని, స్వీయ క్వారంటైన్ లోకి వెళ్లాలని సూచించారు. అంతకుముందు ఆయన “నేతాజీ” సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకయ్యనాయుడు వరుస పర్యటనలు చేస్తూ.. పలు అధికార్యక్రమాల్లో పాల్గొనడంతో కొవిడ్ బారిన పడి ఉండవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.
కాగా దేశంలో 24 గంటల్లో 3,33,533 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది మునుపటి రోజు కంటే కొంచెం తక్కువగా ఉంది. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసుల వివరాలను వెల్లడించింది. 525 కొత్త మరణాలతో మరణాల సంఖ్య 4,89,409కి పెరిగింది.