తెలుగు ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే చాలామంది నటీనటులు కోవిడ్ బారిన పడగా, తాజాగా హీరో రాజేంద్ర ప్రసాద్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని ఏఏజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కు కరోనా సోకిందనే విషయం తెలియగానే.. పలువురు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు హీరోగా రాణించిన ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం సహాయక ప్రాతల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. పెద్ద పెద్ద హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటూ తెలుగు తెరపై ముద్ర వేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన సేనాపతి ఈ మధ్యనే ఓటీటీలో విడుదల అయ్యింది.
Rajendraprasad : రాజేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్!

rajendra prasad