మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం వెళ్తానని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ఆదేశిస్తే వెంటనే ప్రచారం చేసేందుకు వస్తానని స్పష్టం చేశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో తన నివాసంలో భేటీ అయిన ఆయన..మునుగోడు ఉపఎన్నిక.. పార్టీలో తాజా రాజకీయ పరిణామాలు..అభ్యర్థి ఎంపిక వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మనుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.