Saddula Bathukamma : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పట్టణంలో మంగళవారం బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. “ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్క జాములై సందమామ… చూడ జాములై సందమామ…” అంటూ సదులు బతుకమ్మ వాయిద్యాల నడుమ పట్టణం ఉత్సాహంతో నిండిపోయింది. తెలంగాణ ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మ పండుగను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే వేములవాడలో ఒక ప్రత్యేకతతో నిర్వహిస్తారు. ఇక్కడ సప్త రాశుల ఆధారంగా ఏడు రోజులపాటు జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి.
ఉత్సవాల మొదటి రోజు నుండే పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తమ అందమైన బతుకమ్మలను తీసుకువచ్చి, మూలవాగు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్ప వద్ద తమ ఆరాధనలు నిర్వహించి ఉత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలో విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రాంతాలు కాంతులీనగా వెలుగుతుండగా, బతుకమ్మ తెప్ప వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు వేలాది మంది ప్రజల్ని ఆకర్షించాయి. మూలవాగు ప్రాంతం సర్వత్రా పూలతో నిండిపోవడం, ఉత్సాహభరితమైన వాతావరణం చుట్టూ ఆనందాన్ని ప్రసరించింది.
Samantha : తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను – సమంత
ఇందులో ప్రధానంగా ఒగ్గుడోలు నృత్యాలు, మహిళా కళాకారుల కోలాటం ఆటలు ఈసారి మొదటిసారిగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డి తమ ఉత్సాహాన్ని ప్రదర్శించి, ఒగ్గుడోలు, కోలాటం ఆటలతో సమయాన్ని ఆనందంగా గడిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తమ సందడి కలిపారు.
ఉదయం మున్సిపల్ కార్యాలయం నుండి శ్రీ దుర్గామాత అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. పట్టణమంతటా భక్తుల సందడి నడుమ ఊరేగింపు గంగిరెద్దులు, వాయిద్యాల గోల, సాంప్రదాయ రీతుల మధ్య సాగింది. సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఏడు రోజులపాటు నిర్వహించిన ఈ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పట్టణంలో పోలీసు బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఎస్పీ అఖిల్ మహజన్, ఏ.ఎస్పీ శేషాద్రిని రెడ్డిలు ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, ఉత్సవాల్లో పాల్గొనే మహిళలు సంతోషంగా ఉత్సవాలను జరుపుకోవడంలో సహకరించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, విమలక్క వంటి ప్రముఖులు హాజరై ఉత్సవాల వైభవాన్ని మరింత పెంచారు.
RK Roja : ఉప ముఖ్యమంత్రి గారూ…పంచె ఎగ్గాట్టాల్సింది గుడి మెట్లపై కాదు.. పవన్‌పై రోజా ట్వీట్