Site icon HashtagU Telugu

BRSV: ఉద్యమ నాయకుడు వేల్పుకొండ వెంకటేష్ కు పీహెచ్ డీ పట్టా

Brsv

Brsv

BRSV: ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు డా.వేల్పుకొండ వెంకటేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పట్టా పొందాడు. ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ 83వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా ఒకే సారి 1024 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టా పొందే ఘట్టానికి ఠాగూర్ ఆడిటోరియం వేదికగా నిలిచింది.

విశ్వవిద్యాలయ పరిధిలో ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మరో 58 మంది విద్యార్థులు వర్శిటీ ఛాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ చేతుల మీదుగా  బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. ఉస్మానియా క్యాంపస్ లోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒకటైన అడోబ్, అధ్యక్షుడిగా, ముఖ్య కార్యనిర్వహణాధికారి స్థాయికి ఎదిగిన శంతను నారాయణ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.

గవర్నర్ చేతుల మీదుగా ఆయన గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. గతేడాది భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ గౌరవ డాక్టరేట్ అందుకున్న విషయం తెలిసిందే. ఓయూ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొఫెసర్ దండబోయిన రవిందర్ యాదవ్ నాయకత్వంలో వరుసగా మూడో ఏడాది స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.

Exit mobile version