Heavy Rain : హైదరాబాద్ రైతు బజార్ లో కొట్టుకుపోయిన కూరగాయలు

హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్ లో ఆదివారం ఉదయం కురిస్తున్న భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలుతో పాటుగా పలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి

Published By: HashtagU Telugu Desk
Vegetables Washed Away In H

Vegetables Washed Away In H

అల్ప పీడన ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు , వంకలు ఉప్పంగిప్రవహిస్తున్నాయి. దీంతో అనేక చెరువులకు గండి పడి వరద ప్రవాహం ఇళ్లలోకి చేరాయి. అంతే కాదు అనేక చోట రహదారులు , రైల్వే ట్రాక్ లు తెగిపోయి రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. ఇక హైదరాబాద్ లో వర్షం కురుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. కాగా మరో రెండు గంటల్లో నగరంలో అతి భారీ వర్షం కురవనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని , అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లోద్దని. పాత భవనాల కింద , చెట్ల కింద ఉండొద్దని , కరెంట్ స్థంబాలకు దూరంగా ఉండాలి సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్ లో ఆదివారం ఉదయం కురిస్తున్న భారీ వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని ఆకుకూరలుతో పాటుగా పలు కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వాటిని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also : Uddhav Thackeray : మోడీ క్షమాపణల్లో అహంకారం.. శివాజీని అవమానించినందుకు ఓడిస్తాం : థాక్రే

  Last Updated: 01 Sep 2024, 03:49 PM IST