Vegetable Prices: మండిపోతున్న కూరగాయల ధరలు.. నియంత్రణ ఏది?

రాష్ట్రంలో కూరగాయలు కొనాలంటేనే వెనకాడుతున్నారు. సామాన్యులకు కూరగాయల జోలికి వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి

Published By: HashtagU Telugu Desk

Vegetable Prices: రాష్ట్రంలో కూరగాయలు కొనాలంటేనే వెనకాడుతున్నారు. సామాన్యులు కూరగాయల జోలికి వెళ్లాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా 50 రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే ధరలు పెరిగినప్పటికీ రైతులకు గిట్టుబాటు రావట్లేదు. ధరలు పెరిగితే రైతు లాభపడాల్సింది పోయి దళారులు లక్షలు సంపాదిస్తున్నారు. రైతుల వద్ద సగం ధరలకే కూరగాయలు కొనుగోలు చేసి మార్కెట్లో దళారులు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటో 150 చేరుకుంది. మరొకొన్ని ప్రాంతాల్లో 120 పలుకుతుంది.

రోజురోజుకి నిత్యావసర ధరలు పెరుగుతున్నా ప్రభుత్వాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే దళారులు వాళ్ళ మనుషులే కాబట్టి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఓ వైపు కూరగాయలు, మరోవైపు నిత్యావసర ధరలు పెరుగుకుంటూ పోతుంటే సామాన్యులు బ్రతికేదేలా?. ఇప్పటికే సెంచరీ కొట్టిన కూరగాయ ధరలు రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. అయితే కూరగాయల ధరలు పెరగడం వల్ల రైతులు ఏమైనా లాభపడుతున్నారా అంటే అదీ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పండించేది రైతు, లాభపడేది దళారులు. ప్రస్తుతం తెలంగాణాలో ఇదే తంతు కొనసాగుతుంది. ఇకనైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

Read More: Wifes Body In Freezer : ఆ ఫ్రీజర్ లో భార్య డెడ్ బాడీ.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు

  Last Updated: 03 Jul 2023, 08:55 AM IST