Site icon HashtagU Telugu

Veeraswamy: 65 ఏళ్ల వ‌య‌సులో అరుదైన రికార్డ్

Veeraswamy

Veeraswamy

తెలంగాణ‌లోని మంచిర్యాల పట్టణానికి చెందిన వేముల వీర‌స్వామి 65 ఏళ్ల వ‌య‌సులో రికార్డు సృష్టించాడు. ఆదివారం వరంగల్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించాడు. మంగళవారం మంచిర్యాలలో ఫిట్‌నెస్ ప్రేమికులు ఆయనను ఘనంగా సత్కరించారు. హన్మకొండలోని జవహర్‌లాల్‌ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో పట్టణంలోని జన్మభూమి నగర్‌కు చెందిన వీరస్వామి 65-70 ఏళ్లలోపు విభాగంలో లాంగ్‌జంప్‌, ట్రిపుల్‌జంప్‌లో బంగారు పతకం సాధించాడు.

రాష్ట్ర స్థాయి ఈవెంట్‌లో మెరిసినందుకు అతని స్నేహితులు, పట్టణంలోని ఫిట్‌నెస్ ఫ్రీక్స్ ఆయ‌న్ని అభినందించారు. జిల్లాకు గుర్తింపు తెచ్చారని వారు అభిప్రాయపడ్డారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కార్యకర్త, మంచిర్యాల వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు, వీరస్వామి 2020లో మందమర్రిలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా ఆసనాల పోటీలో మొదటి బహుమతిని గెలుచుకున్నారు. దుప్పట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు మరియు సుమారు 540 స్వచ్ఛంద కార్యక్రమాలను ఆయ‌న నిర్వహించారు. వీర‌స్వామి మూడు నెల‌ల పాటు కోవిడ్ చికిత్స పొంది క‌రోనాను జ‌యించాడు. లాక్‌డౌన్‌ సమయంలో కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Exit mobile version