Site icon HashtagU Telugu

Liquor Scam : లిక్కర్ స్కామ్‌లో వాసుదేవరెడ్డి అరెస్టు..?

Vasudevareddy

Vasudevareddy

లిక్కర్ స్కామ్‌(Liquor Scam)లో ప్రధాన పాత్రధారుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డి (Vasudevareddy పరారీలో ఉన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ కీలక వ్యక్తులు వాసుదేవరెడ్డి‌ను ముందుపెట్టే స్కామ్‌ను నడిపించారని, ఇప్పుడు ఆయన కనిపించకపోవడంతో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తాజాగా వాసుదేవరెడ్డి‌ను సీఐడీ(CID) అధికారులు అరెస్టు చేశారని, ఆయనపై విచారణ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Prime Minister Modi : ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత.. ఎస్‌పీజీ ఆధీనంలో ఆంధ్రా వర్సిటీ

వాసుదేవరెడ్డి‌ను హైదరాబాద్ శివార్లలో సీఐడీ అధికారులు మూడు రోజులుగా నిర్భంధించి విచారణ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, గత ప్రభుత్వ కీలక వ్యక్తుల పేర్లు చెప్పేలా ఒత్తిడి తెస్తున్నారని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. మరి నిజంగా సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారా..? లేక ఆయనే కనిపించకుండా ఇతర దేశాలకు వెల్లిపోయారా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తే.. లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తుల పేర్లు బయట పడతాయని వైసీపీ ఆందోళన చెందుతోంది. జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వంటి పెద్ద పేర్లు లిక్కర్ స్కామ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్న నేపథ్యంలో, వాసుదేవరెడ్డి అరెస్ట్ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.