Site icon HashtagU Telugu

parijat: మీ ఇంట్లో పారిజాతం మొక్క ఉందా.. అయితే ఈ వాస్తు నియమాలు పాటించాల్సిందే!

Parijatham

Parijatham

మామూలుగా వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్నో రకాల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం. వాటిలో పారిజాతం మొక్క కూడా ఒకటి. అయితే చాలామంది తెలిసి తెలియక ఈ పారిజాతం మొక్క విషయంలో కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు. పారిజాతం మొక్క విషయంలో ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పారిజాత పుష్పాలు.. వీటినే దేవతా పుష్పాలు అని కూడా అంటారు.

పారిజాతం చెట్టుకు దేవతా వృక్షం అని పేరు కూడా ఉంది. హిందువులు కూడా ఈ పారిజాతం మొక్కను చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. కాగా పారిజాతం మొక్కను దేవతా వృక్షం అని అంటారు. ఈ మొక్కతో పాటు పాటు మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం వంటి వాటిని కూడా దేవతా వృక్షాలని అంటారు. సువాసనలు వెదజల్లే పారిజాత పువ్వులతో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయట. రాత్రి సమయంలో పూసి సువాసనల్ని వెదజల్లే ఈ పువ్వుల గొప్పదనమే కాదు పారిజాత చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెబుతున్నారు.

అయితే ఇంత గొప్పదనం కలిగిన పారిజాతాలు రాత్రి సమయంలోనే పూస్తాయి. ఉదయానికల్లా రాలిపోతాయి. అందుకే రాత్రి పూసి ఉదయానికే రాలిపోయినా పూజకు ఉపయోగించవచ్చట. వీటికి దోషం లేదట. చెట్టుకింద రాలినా వాటి అందం వాటి సువాసన మాత్రం ఏమాత్రం తగ్గవట. చెట్టుకింద తివాచీ పరిచనట్లుండా పారిజాతాల అందం చూస్తే మనస్సు ఆహ్లాదంతో నిండిపోతుందట. కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదట. అయితే ఈ మొక్కను పెంచుకునే వారు కొన్ని విషయాలను గుర్తుంచు కోవడం తప్పనిసరి. అయితే వాస్తు ప్రకారం, పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటడం మంచిది.

ఇది ఇంటికి శుభం, శాంతి మరియు శ్రేయస్సును తెస్తుంది. అలాగే ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుందట. ఈశాన్య దిశలో పారిజాత మొక్కను నాటడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు. ఇది ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుందట. అలాగే పెరట్లో పారిజాత మొక్కను నాటడం ద్వారా సంపద పెరుగుతుందనే నమ్మకం చాలామందికి ఉంది. శుక్రవారం లేదా సోమవారం, శుక్రవారం సాయంత్రం నాటడం మంచిది అని చెబుతున్నారు. పారిజాతం మొక్క వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు. కాగా శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు పారిజాతం ఆకులు, పూల టీని చేసుకుని తేనె కలుపుకుని పరగడుపున రోజూ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని ఇది పలుచన చేసి బయటకు తోసి వేస్తుంది. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ తగ్గుముఖం పడతాయట.