Site icon HashtagU Telugu

Vastu Shastra: మీ ఇంటి తలుపు వినాశనం వైపు తెరుచుకోవడం లేదు కదా ? ఒకసారి చెక్ చేసుకోండి

Door Imresizer

Door Imresizer

ఇంటి ప్రధాన ద్వారానికి .. మన అదృష్టంతో సంబంధం ఉంటుందా?

మన ఇంటి ప్రధాన ద్వారం ఉండే దిశను బట్టి ..గ్రహ ప్రభావం పడుతుందా?

ఒకవేళ గ్రహ ప్రభావం ప్రతికూలంగా ఉంటే జీవితంలో సమస్యలు చుట్టుముడుతాయా?

అంటే.. వాస్తు నిపుణులు ఔను అని సమాధానం చెబుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం దిశ , గ్రహ ప్రభావం, జీవితంలో చోటుచేసుకునే ఘటనల గురించి ఇలా వివరించారు.

​ఈశాన్య దిశ..

ఈ దిశను ఇంటి ప్రధాన ద్వారం ఉండేందుకు అత్యంత పవిత్రమైన దిశగా పరిగణిస్తారు. ప్రజలు తరచూ వారి ప్రార్ధనా స్థలాలను ఈ దిశలో ఏర్పాటు చేస్తారు. ఈ దిశలో ప్రధాన ద్వారం ఉండటం చాలా శుభంగా పరిగణించబడుతుంది.
అయితే ఈ ఇంట్లో నివసించే వారి జాతక చక్రంలో బృహస్పతి గ్రహ స్థితి బాగా లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఇంటి తలుపు ఉండే దిశ నుంచి పెద్ద పెద్ద వ్యాధులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇంట్లో ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేస్తాయి.

తూర్పు దిశ..

తూర్పు దిశలో ప్రధాన తలుపు ఉండటం వల్ల ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఆనందం, వేడుకల వాతావరణాన్ని నిర్వహిస్తుంది. ఈ దిశలో ప్రధాన ద్వారం కలిగి ఉండటం ద్వారా మీరు దేవతల గరిష్ఠ ఆశీర్వాదం పొందుతారు.
అయితే ఈ ఇంట్లో ఉండే వారి జాతక చక్రంలో మంగళ గ్రహము స్థితి బాగా లేకుంటే తిప్పలు తప్పవు. ఫలితంగా ఇంట్లో ఉన్నవారి అప్పులు పెరుగుతూ పోతాయి. ఒక్కో పైసా కోసం విలవిలలాడాల్సిన దుస్థితి వస్తుంది.

దక్షిణ దిశ

మీ ఇల్లు దక్షిణ దిశ గోడపై మాత్రమే ప్రదేశం ఇవ్వగలిగితే అది ఆగ్నేయ మూలలో ఉండాలి అని గుర్తుంచుకోండి. పొరపాటున ప్రధాన ద్వారం నైరుతి గోడపై ఉంచకూడదు. వాస్తు ప్రకారం దక్షిణ దిశను మంచిగా పరిగణించరు. అయితే మీకు ఉత్తరాన ఓ తలుపు ఉంటే అప్పుడు మీరు మరొకటి ఉంచవచ్చు. ఈ విధంగా ఉండటం ద్వారా జీవితంలో అనుకూల ఫలితాలు అందుకుంటారు. అయితే.. ఇంట్లో ఉండేవారి జాతక చక్రంలో శని గ్రహం, మంగళ గ్రహం స్థితి బాగా ఉంటే.. సుఖ సంతోషాలు, ధన ధాన్యాలతో విలసిల్లుతారు. ఒకవేళ గ్రహాలు అనుకూలించకుంటే జీవితంలో సంఘర్షణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పశ్చిమ దిశ..

మీ ఇల్లు పశ్చిమ దిశలో ఉంటే ప్రవేశద్వారం ఉత్తరపు గోడ వైపు మాత్రమే ఉంటుంది. కాబట్టి వాయువ్య దిశలో ఉంచాలని గుర్తుంచుకోండి. సూర్యుడు ఈ దిశలో ఉండటం వల్ల ఎంతో శక్తిమంతమైన కాంతి ప్రసరిస్తుంది. ఈ విధంగా ఉండటం వల్ల ప్రత్యేకంగా, సమృద్ధిగా ఉంటుంది. ఈ విధంగా ఉండటం వల్ల జీవితంలో వచ్చే కష్టాలను సులభంగా ఎదుర్కొంటారు. అయితే..ఇంట్లో ఉండేవారి జాతక చక్రంలో బుధ గ్రహం అనుకూలంగా లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో డబ్బు నిలవదు. సంపద ఆవిరి అయిపోతుంది.

ఇవి గుర్తుంచుకోండి

* ఇంటి గుమ్మాన్ని శుభ్రంగా ఉంచుకోండి. మామిడి ఆకుల తోరణం అలంకరించుకోండి.

* ఇంటి ప్రధాన ద్వారం లోపలి వైపు (ఇంట్లో) వినాయకుడి ప్రతిమ అమర్చుకోండి.

* ఇంటి గుమ్మం దిశలో వరండా ఉంటే దానిమ్మ మొక్క, షమీ మొక్క నాటుకోండి.