Site icon HashtagU Telugu

Varun Tej- Lavanya: ఘనంగా వరుణ్ తేజ్- లావణ్యల వివాహం.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..!

Varun Tej- Lavanya

Compressjpeg.online 1280x720 Image 11zon

Varun Tej- Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Varun Tej- Lavanya)తో లవ్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా జూన్‌ 9న కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంటకు నిశ్చితార్ధం జరిగింది. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌ను జరుపుకున్నారు. అందులో భాగంగా వరుణ్, లావణ్యలు తమకు ఇష్టమైన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ జంట పెళ్లి జరిగింది. నవంబర్ 1న ఈ స్టార్ కపుల్ వివాహా బంధంతో ఒకటి అయ్యారు. ఇటలీ, టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాలతో పాటు బంధువులు, స్నేహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పెళ్లి తర్వాత కొత్త జంట నమస్కారం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొత్త జంటను అభిమానులతో సహా పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. వరుణ్ పెళ్లికి పవన్ కల్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, నితిన్ సహా పలువురు టాలీవుడ్ నుంచి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

Also Read: Manchu Manoj : ముఖేష్ అంబానీ తో మంచు మనోజ్..

వరుణ్ తేజ్, లావణ్యల వివాహం బుధవారం రాత్రి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలు క్లిన్ కారను ముద్దాడుతున్న ఫోటో వైరల్ అవుతుంది. మనవరాలు పుట్టిన తర్వాత చిరు ఆమెను లాలిస్తున్నట్లు బయటకొచ్చిన మొదటి ఫోటో ఇదే. వీటితో పాటు పెళ్లి మండపంలో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ నెల 5న వరుణ్- లావణ్యల రిసెప్షన్ మాదాపూర్ ఎన్- కన్వెన్షన్ లో జరగనుంది.