Vangaveeti Radha Marriage : పెళ్లి పీటలెక్కబోతున్న వంగవీటి రాధా..వధువు ఆమెనేనట..

నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె

Published By: HashtagU Telugu Desk
Vangaveeti Radha Marriage

Vangaveeti Radha Marriage

వంగవీటి రాధా (Vangaveeti Radha ) పెళ్లి చేసుకోబోతున్నాడు..ఇప్పుడు ఏపీలో ఇదే మాట్లాడుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో పరిచయం చేయనవసరం లేని పేరు వంగవీటి రాధాకృష్ణ. వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohana Ranga) వారసుడిగా రాజకీయల్లోకి అడుగుపెట్టిన రాధా గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. వంగవీటి రంగా కుమారుడిగా రాధా కు మంచి గుర్తింపు..కుల బలం ఉంది. అయితే రాధా పెళ్లి (Vangaveeti Radha Wedding) చూడాలని ఆయన అభిమానులు ఎప్పటి నుండి కోరుకుంటున్నారు..ఇప్పుడా క్షణం వచ్చింది.

నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని (Jakkam Pushpavalli) రాధా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్‌మెంట్ ఉంటుందని.. సెప్టెంబర్ 6న వివాహం జరగనుందని కొందరు అంటుంటే.. అక్టోబర్ నెలలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు మరికొంతమంది చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. పెళ్లి మాత్రం విజయవాడలో జరగబోతుందని సమాచారం.

ఇక రాధా రాజకీయాల విషయానికి వస్తే..రాధకృష్ణ తొలిసారిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉండి తర్వాత టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలనేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ జనసేన , లేదా వైసీపీలోకి కూడా వెళ్తారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు, ఏపార్టీలో ఉంటారనే అంశంపైనే చర్చ నడుస్తోంది.

  Last Updated: 16 Aug 2023, 03:34 PM IST