Site icon HashtagU Telugu

Valentines Day: అక్కడ ప్రతి నెల 14న ప్రేమికుల దినోత్సవమే.. ఏ దేశమో తెలుసా?

Korean Valentines Year

Korean Valentines Year

Valentines Day: ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవానికి ఉన్న ప్రత్యేకతే వేరు. కొన్ని కోట్ల జంటలు ఈ రోజున తమ మధురానుభూతుల్ని ఎంతో ప్రత్యేకంగా పంచుకుంటాయి. పాత జంటల ముచ్చట్లు ఒకటైతే.. కొత్తగా ఆవిర్భవించే జంటల ముచ్చట్లు మరోకటి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రోజు కోసం ఎంతోమంది యువ ప్రేమికులు వెయిట్‌ చేస్తుంటారు. సాధారణంగా అంతా సంవత్సరానికి ఓసారి వచ్చే ప్రేమికుల దినోత్సవాన్ని
చూస్తే… ఆ దేశంలో ప్రతి నెల ప్రేమికుల దినోత్సవం ఉంటుంది. అసలు పన్నెండు నెలల్లో పన్నెండు రోజులు ఏఏ ప్రత్యేకలతో.. ఈ ప్రేమికులు ప్రేమ దినోత్సవాల్ని ఎంజాయ్‌ చేస్తారో చూద్దాం.

దక్షిణ కొరియాలో జనవరి 14ను డైరీ డేగా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు,  ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును క్యాండిల్ డేగానూ జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిప్ట్‌గా ‌ఏమీ ఇవ్వకూడదు. ఇది అనాది కాలంగా సాంప్రదాయంగా కొనసాగుతోంది. వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే ‘వైట్ డే’ కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్‌ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు.

వాలెంటైన్స్ డే, వైట్‌ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత ఏప్రిల్ 14న బ్లాక్ డే ను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. మే 14 ఎల్లో డే. ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు.
జూన్‌ 14ను కిస్ డే గా జరుపుకుంటారు. కొరియన్ల ఫేవరెట్ డే ఇది.

జులై 14ను సిల్వర్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. ‌ఆగస్టు 15ను గ్రీన్‌ డే నామకరణం చేశారు. ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. సెప్టెంబర్ 14న ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. అక్టోబర్ 14 వైన్ డేగా ఉంటుంది. ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. నవంబర్ 14 మూవీ డే, డిసెంబర్‌ 14న హగ్‌గా చేసుకుంటారు. ఇలా ప్రతి నెల 14వ తేదీని ప్రత్యేకంగా జరుపుంటారు ఆ దేశ ప్రజలు.