TTD : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ, వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ సిబ్బంది, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నమయ్య భవనంలో టీటీడీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్ష చేశారు.
CAQM: ఢిల్లీలోని పాఠశాలలు తెరవడంపై CAQM కొత్త సూచనలు.. ఏంటంటే?
ఉదయాస్తమాన సేవ టికెట్ల మార్పులపై టీటీడీ నిర్ణయం
శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్ పొందిన భక్తులకు తమ పేర్లను మార్పు చేసుకునే అవకాశం లేదని టీటీడీ ధర్మకర్తల మండలి స్పష్టంచేసింది. గతంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పాలనలో ఈ మార్పులకు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వ్యతిరేకతతో పాటు తగిన అమలు పద్ధతుల లేమి వల్ల ఆ నిర్ణయం అమలు కాలేదు. సేవా టికెట్ ధరలు సాధారణ రోజుల్లో రూ. కోటి, శుక్రవారం రూ. కోటిన్నర ఉంటాయి. ఈ టికెట్‌తో భక్తుడు ఐదుగురితో కలిసి శ్రీవారి సేవలను ప్రత్యక్షంగా చూసే అవకాశం పొందుతాడు. అయితే టికెట్ పొందిన భక్తులు తమతో వచ్చే ఐదుగురి పేర్లను ముందుగానే నమోదు చేయాలి. ఇదే క్రమంలో, 2024 జనవరిలో మండలి టికెట్‌దారుల పేర్ల మార్పుకు అనుమతిస్తూ తీర్మానించింది.
కానీ ఈ నిర్ణయం బ్లాక్‌మార్కెట్‌కు అవకాశం కల్పిస్తుందన్న విమర్శలతో ఆచరణలో రాలేదు. తాజాగా పాలకమండలి ఈ తీర్మానాన్ని పక్కన పెట్టి భక్తుల పేర్ల మార్పు అనుమతిని నిలిపివేసింది. దీంతో భక్తులు టికెట్ పొందినప్పుడే వారి వివరాలను పూర్తిగా అందించాల్సి ఉంటుంది. ఈ మార్పులతో సేవలకు అనధికార మార్పులను నివారించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ ప్రకటించింది. పద్దతులు కఠినంగా అమలు చేస్తూ, భక్తుల అవసరాలను సమర్థంగా నెరవేర్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.