తెలంగాణ తిరుమల యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. గుట్టపైనున్న బాలాలయంలో వైకుంఠద్వారం గుండా గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారు. వేకువజామునుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనం చేసుకుంటున్నారు.
సూర్యుడు ఉత్త రాయణానికి మరే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.ఈ రోజున సాక్షాత్తు మహావిష్ణువు గారుడవహనంపై ముకోటి దేవతలతో భూలోకానికి వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారని ప్రతీతి. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయి.అందుకే భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని పాపవిముక్తులు అవుతారు.