Site icon HashtagU Telugu

Modi: వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫోటో తొలగింపు.. కారణమేంటంటే!

vaccination certificate

vaccination certificate

త్వరలోనే ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వాక్సినేషన్ సర్టిఫికెట్ నుండి మోదీ ఫోటో తీసేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్త‌రాఖండ్, గోవా మణిపూర్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎన్నికల కోసం ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది ఎన్నికలు జరిగిన వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరిగినప్పుడు కూడా కేంద్రం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది.

వాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫోటో ఉండడాన్ని ప్రతిపక్ష నేతలతో పాటు, సామాన్యులు కూడా వ్యతిరేకిస్తున్నారు. సర్టిఫికెట్ పై మోదీ ఫోటో ఉండడాన్ని సవాలు చేస్తూ కొందరు ఆయా రాష్ట్రాల హై కోర్టుల్లో పిల్ కూడా వేశారు. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ ప్రస్తుతం ఎన్నికలున్న ఐదు రాష్ట్రాల్లో మార్చి 10 వరకు వాక్సినేషన్ సర్టిఫికెట్ లో మోదీ ఫోటో కనిపించదు.