Site icon HashtagU Telugu

Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం

File Photo

కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్‌ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌లో ప్రారంభమవుతుందని కేంద్రం ప్రకటించింది. ఆధార్‌ కార్డుతో కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి జనవరి 3 నుంచి టీకాలు వేయనున్నారు.