Uttarkashi tunnel collapse: ఉత్తరాఖండ్ ఉత్తరకాశిలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు నిర్వహించిన వర్టికల్ డ్రిల్లింగ్‌లో గంటన్నర వ్యవధిలో 8 మీటర్ల దూరాన్ని అధిగమించారు. ప్రస్తుతం 900 ఎంఎం డయామీటర్‌తో పైపులైన్ వేసేందుకు పనులు కొనసాగుతున్నాయి.
సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ ఆదివారం ప్రారంభమైంది. వర్టికల్ డ్రిల్లింగ్ కోసం రెండు ప్రదేశాలను గుర్తించి, రెండో ఆప్షన్‌గా కార్మికులను కాపాడేందుకు సొరంగం పైనున్న మరో విభాగంలో నిలువు డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. ఘటనా స్థలంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం లేదని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ తెలిపారు. సంఘటనా స్థలంలో వివిధ ఏజెన్సీలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. కాగా లోపల చిక్కుకుపోయిన కార్మికులకు అధికారులు ప్లాస్టిక్ బాటిళ్లలో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. కూలీలు ఆరోగ్యంగా ఉండేందుకు పైపుల ద్వారా అరటిపండ్లు, యాపిల్స్ పంపిస్తున్నారు. కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ఛార్జర్‌తో ఫోన్‌ను అందించారు.
Also Read: Telangana: కేసీఆర్ నడిచే రోడ్డు, చదివిన పాఠశాల కాంగ్రెస్ నిర్మించిందే: రాహుల్