Uttar Pradesh: లూడో గేమ్ లో తనను తానే పందెంలో పెట్టుకున్న యువతి.. ఓడిపోవడంతో యజమానితో అలా?

ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Uttar Pradesh

Uttar Pradesh

ఈ మధ్యకాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా క్రమంగా వాటికి బానిసలుగా కూడా మారుతున్నారు. ఇక ఆ గేమ్ లలో బెట్టింగ్ ల కోసం వస్తువులు బంగారు ఇలా వేటిని తాకట్టు పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు. అయితే తాజాగా ఒక మహిళ ఒక ఆటకి బానిస అయ్యి వస్తువులకు బదులుగా బెట్టింగ్ లో తనను తానే తాకట్టు పెట్టుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. లూడో గేమ్ కి ఒక మహిళ బానిసగా మారింది. రేణు అనే మహిళ భర్తతోపాటు ప్రతాప్ గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతంలో నివసిస్తోంది.

కాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆరు నెలల క్రితం భర్త ఉపాధి నిమిత్తం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. ఇటుకల బట్టీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అక్కడ కష్టపడి పని చేసి ఆ డబ్బును భార్యకు పంపించేవాడు. అయితే భర్త ఎంతో కష్టపడి సంపాదించి పంపించిన ఆ డబ్బుతో నడిపిస్తూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆ మహిళ ఆన్లైన్ లో లూడో గేమ్ ఆడేది. రేణు తన ఇంటి యజమానితో కలిసి ఆట ఆడుతూ ఉండేది. అలా ప్రతిరోజు ఆట ఆడి ఆడి లూడో గేమ్ కి బానిస అయింది. డబ్బులు పెట్టి మరి గేమ్ ఆడగా ఆ డబ్బులు అయిపోవడంతో చివరికి ఏం చేయాలో తెలియక ఆ ఆట కోసం ఏకంగా రేణు తనను తానే పణంగా పెట్టుకుంది.

తనపై తానే పందెం కాసి లూడో ఆడింది. అయితే ఆ ఆటలో మహిళ ఓడిపోయింది. దాంతో యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. అదే విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. అంతే కాకుండా తన భర్తని ఆ ప్రదేశానికి రావద్దు అని కూడా ఆమె తెలిపింది. రేణు మాటలు విని షాక్ అయిన ఆమె భర్త ప్రతాప్ గడ్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం అంతా పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

  Last Updated: 05 Dec 2022, 07:21 PM IST