Fire in Meerut: మీర‌ట్‌లో ఘోరం.. మొబైల్ పేలి న‌లుగురు చిన్నారులు మృతి, ఇద్ద‌రి పరిస్థితి విష‌మం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్య్కూట్ (Fire in Meerut) జరిగింది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి.

  • Written By:
  • Updated On - March 24, 2024 / 03:34 PM IST

Fire in Meerut: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా జనతా కాలనీలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్య్కూట్ (Fire in Meerut) జరిగింది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇంట్లోని నలుగురు పిల్లలతోపాటు తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన కుటుంబసభ్యులను ఆస్పత్రికి తరలించారు. వారిలో సారిక(10), నిహారిక(8), సంస్కర్(6), కలూ(4)లు మృతిచెందారు. తల్లిదండ్రులు జానీ, బబితలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా కలకలం రేపుతోంది.

ఇంట్లో ఉన్న మొబైల్ ఫోన్ చార్జింగ్‌లో ఉందని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఛార్జర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మొబైల్‌ పేలిపోయింది. పేలుడు చాలా బలంగా ఉంది. మంటలు మంచం, కర్టెన్లను చుట్టుముట్టాయి. కొద్దిసేపటికే మంటలు గది మొత్తం వ్యాపించాయి. గదిలో ఉన్న నలుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. పిల్లలను కాపాడే క్రమంలో తల్లిదండ్రులు కూడా కాలిన గాయాలకు గురయ్యారు. మంటలకు ఎవ్వరూ బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.

Also Read: Khammam: బీఆర్ఎస్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుందా..? బీజేపీలోకి నామా నాగేశ్వరరావు..?

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో కలూ(5), సంస్కర్(6), నిహారిక (8), సారిక (12) చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని తండ్రి జానీ మెడికల్ కాలేజీలో, తల్లి బబిత ఎయిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారు. కుమార్తె నిహారిక, కుమారుడు సంస్కర్ రాత్రి 2 గంటల సమయంలో మృతి చెందారు. అక్క సారిక తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందగా, చిన్న కుమారుడు కలూ కూడా ఉదయం 10 గంటలకు మృతి చెందాడు.

We’re now on WhatsApp : Click to Join

జానీ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, బబిత పరిస్థితి విషమంగా ఉన్నందున ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారి తెలిపారు. నిహారిక, క‌లూ, సంస్క‌ర్‌ మొబైల్‌లో గేమ్‌లు ఆడుతున్నారని, ఈ సమయంలో మొబైల్‌ కూడా ఛార్జ్‌ అవుతుందని జానీ చెప్పాడు. ఇంతలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, కొద్దిసేపటికే మంటలు భారీ రూపం దాల్చాయని తెలిపిన‌ట్లు స‌మాచారం.