ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy).. ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ప్రత్యర్థి పార్టీల నేతలకు కౌంటర్లు ఇస్తూ.. తన వాక్చాతుర్యంతో చెమటలు పట్టించే ఫైర్ బ్రాండ్. ఉత్తమ్ పేరు చెపితే చాలు యువతలో ఉత్సహం ఉప్పొంగిపోతుంది. దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యుద్ధ విమానాలను నడిపి మంచి పేరు తెచ్చుకున్నారు. పేరు మాత్రమే కాదు ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లో చేరి పీసీసీ పదవి బాధ్యతలు చేపట్టి ఉత్తమ నాయకుడిగా ఉత్తమ్ కుమార్ (Uttam Kumar Reddy) గుర్తింపు తెచ్చుకున్నారు.
రాజకీయాల్లో అతి కొద్దీ కాలంలోనే మాస్ లీడర్ గా ఎదిగిన ఉత్తమ్..ఆర్మీ ఆఫీసర్ నుండి నేడు దేశవ్యాప్తంగా లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే CEC (Central Election Committee) కమిటీలో చోటు దక్కించుకునే స్థాయికి ఎదిగారు. గత 30 ఏళ్లుగా ఈ కమిటీలో తెలుగు వారు అంటూ ఎవ్వరు లేరు. అలాంటి ఈ కమిటీలో ఏ తెలుగువారికి దక్కని గౌరవం ఉత్తమ్ కు దక్కింది.
ఈ హోదా కోసం చాలామంది సీనియర్ నేతలు ట్రై చేస్తుంటారు కానీ..వారెవరికీ దక్కని చోటు మన ఉత్తమ్ కు దక్కడం అది తెలుగు వారి గౌరవంగా చెప్పుకోవాలి. దేశం కోసం పోరాడిన మహాత్మాగాంధీ , నెహ్రు వంటి దిగ్గజ నేతలు స్థాపించిన కాంగ్రెస్ పార్టీ లో ఉత్తమ్ కు లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే బాధ్యత రావడం గొప్ప విషయం.
16 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వారిలో 1. మల్లికార్జున్ ఖర్గే, 2. సోనియా గాంధీ, 3. రాహుల్ గాంధీ, 4. అంబికా సోని, 5. అధిర్ రంజన్ చౌదరి, 6. సల్మాన్ ఖుర్షీద్, 7. మధుసూదన్ మిస్త్రీ, 8. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9. టీఎస్ సింగ్ దేవ్, 10. కేజే జియోగ్రే, 11. ప్రీతమ్ సింగ్, 12. మహ్మద్ జావేద్, 13. అమీ యాజ్ఞిక్, 14. పిఎల్ పునియా, 15. ఓంకార్ మార్కం, 16. కేసీ వేణుగోపాల్ లకు చోటు దక్కింది.
Also Read: Telugu States : కీలకం కానున్న తెలుగు రాష్ట్రాలు
అసలు ఉత్తమ్ (Uttam Kumar Reddy) బాల్య జీవితాన్ని చూస్తే..
1962, జూన్ 20న సూర్యాపేటలో పురుషోత్తం రెడ్డి, ఉషారాణి లకు జన్మించాడు. తాటిపాముల పాఠశాల చదువు పూర్తి చేసిన ఉత్తమ్..ఇంటర్ హైదరాబాద్ లో చేసారు. చిన్నపాటి నుండి ఉత్తమ్ కు దేశం కోసం ఏదోకటి చేయాలనే తపన ఉండేది. అలాగే మిత్రులకు కూడా దేశం కోసం ఏదోకటి చేయాలనీ సూచించేవారు. ఆ తర్వాత UPSC పరీక్షా రాసి National Defence Academy కి సెలక్ట్ అయ్యారు. భారత వైమానిక దళంలో పైలట్ గా తన సేవలనందించాడు. 19 ఏళ్ల వయసులోనే భారత యువసేనలో ఫైలెట్ ఆఫీసర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ బార్డర్ వద్ద రాజస్థాన్ , జమ్మూకాశ్మీర్ , పంజాబ్ , గుజరాత్ ప్రాంతాలలో దాదాపు ఆరేళ్ల పాటు పనిచేసారు. పైలట్ గా ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 విమానాలను నడిపాడు. పాకిస్థాన్ , చైనా సరిహద్దుల్లో పనిచేసి Galandari అవార్డు అందుకున్నారు. అలాగే రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు.
ఇలా ఉద్యోగం చేసుకుంటూనే రాజకీయాలపై అవగాహనా పెంచుకున్న ఉత్తమ్..రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. ఆర్మీ ద్వారా దేశానికి సేవ చేసిన ఉత్తమ్..రాజకీయాలతో ప్రజలకు సేవ చేయాలనీ కోరికతో తన పదవికి రాజీనామా చేసి..1994 లో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి అడుగుపెట్టారు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఇలా ఒకే చోట నుండి ఒకే పార్టీ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఓసారి ఎంపీగా ఉత్తమ్ గెలిచి ఎవరికీ దక్కని రికార్డు సొంతం చేసుకున్నాడు.
Also Read: INDIA Name Change : ‘ఇండియా’ పేరును ‘భారత్’ గా మార్చే యోచనలో కేంద్రం
అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశాడు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా 2015 నుండి పనిచేయడం జరిగింది. ఇక ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ, బలహీన వర్గాలకు కేబినెట్ మంత్రిగా పనిచేసి.. అత్యధిక సంఖ్యలో ఇల్లుకట్టించిన మంత్రి గా ఉత్తమ్ రికార్డు నెలకొల్పారు.
అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ గా పనిచేసిన ఉత్తమ్..ఆ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటింగ్ శాతాన్ని సైతం ఎంతగానో పెంచారు. 2014 లో కాంగ్రెస్ ఓటింగ్ శాతం 24 % గా ఉండగా..2018 లో దాదాపు 30 శాతానికి పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో బస్సు యాత్ర చేపట్టి ప్రజకు మరింత చేరువయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రానప్పటికీ ..పార్టీ విజయం కోసం ఉత్తమ్ ఎంతగానో కష్టపడ్డారు.
అలాగే పార్లమెంట్ అటెండైన్స్ లో కూడా 100 % అటెండెన్స్ గా ఉత్తమ్ కు ఉంది. అలాగే పార్లమెంట్ లో తెలంగాణ కు సంబదించిన అన్ని విషయాల గురించి ప్రస్తావించి తెలంగాణ గొంతుక అని పేరు సైతం ఉత్తమ్ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ అప్పులు , సింగరేణి విషయంలో బిజెపి వ్యవహారం వంటి కీలక విషయాల గురించి ఉత్తమ్ పార్లమెంట్ లో ప్రస్తావించి ప్రజలకు తెలిసేలా చేసారు. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్ట్ లు తేవడంలో ఉత్తమ్ సక్సెస్ అయ్యారు.
ఓవరాల్ గా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన ఉత్తమ్..నేడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతగానో కష్టపడుతూ ప్రజల మెప్పు పొందుతూ..కీలక బాధ్యతలు చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉత్తమ్ కు ఎన్నో బాధ్యతలు దక్కాలని యావత్ ప్రజానీకం కోరుతుంది.
Also Read: Udayanidhi Stalin : సనాతన ధర్మమా..? సామాజిక న్యాయమా..?