Site icon HashtagU Telugu

Financial Centre : నిజామాబాద్‌లో కొత్త ఫైనాన్షియల్ సెంటర్‌ ప్రారంభించిన యూటీఐ మ్యుచువల్ ఫండ్

UTI Mutual Fund has launched a new financial center in Nizamabad

UTI Mutual Fund has launched a new financial center in Nizamabad

UTI Mutual Fund : భారతదేశంలోని అసెట్ మేనేజ్‌మెంట్ దిగ్గజాల్లో ఒకటైన యూటీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (యూటీఐ ఏఎంసీ) తెలంగాణలోని నిజామాబాద్‌లో తమ కొత్త యూఎఫ్‌సీని ప్రారంభించినట్లు తెలియజేయడానికి సంతోషిస్తోంది. దీని చిరునామా, D. No. 5-6-430, వార్డ్ 5, బ్లాక్ 6, షాప్ A, గింజా వ్యూ, మొదటి అంతస్తు, బ్యాంక్ ఆఫ్ బరోడా బిల్డింగ్, ఎల్లమ్మగుట్ట, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్, తెలంగాణ – 503 003.

నవంబర్ 18న తూర్పు, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో 19 కొత్త యూటీఐ ఫైనాన్షియల్ సెంటర్లను (యూఎఫ్‌సీ) ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందింపచేసేందుకు, B30 నగరాలు, అలాగే వాటికన్నా చిన్న ప్రాంతాల్లోని ఇన్వెస్టర్లను కూడా మ్యుచువల్ ఫండ్ పెట్టుబడుల ద్వారా ఆర్థిక వ్యవస్థ ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చే దిశగా, దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించాలని యూటీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

“మా పూర్తి సేవలను ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేసేందుకు, నిరాటంకంగా అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో మేము కొత్తగా యూటీఐ ఫైనాన్షియల్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. గత కొన్నేళ్లుగా మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య, ముఖ్యంగా B30 నగరాల్లో, గణనీయంగా పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై అవగాహన పెంచడం మరియు వాటిని అందరికీ అందుబాటులోకి తేవడమనే మా దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా కార్యకలాపాలను విస్తరిస్తున్నాం” అని సంస్థ ఎండీ మరియు సీఈవో Mr. ఇంతయాజుర్ రెహ్మాన్ (Imtaiyazur Rahman) తెలిపారు.

ఫైనాన్షియల్ సెంటర్లు (యూఎఫ్‌సీ), బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్స్, మ్యుచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ (ఎంఎఫ్‌డీ), బ్యాంకులతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు సహా పటిష్టమైన పంపిణీ వ్యవస్థ ద్వారా ఇన్వెస్టర్లకు మరింత చేరువయ్యేందుకు యూటీఐ మ్యుచువల్ ఫండ్ కట్టుబడి ఉంది.

Read Also: Tiger Fear : ఆదిలాబాద్‌ ఏజెన్సీ గ్రామాల్లో పులి దడ.. ఎట్టకేలకు ‘కవ్వాల్‌‌’లోకి టైగర్