Usha Vance : ఏప్రిల్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ తమ ముగ్గురు పిల్లలతో కలిసి భారతదేశ పర్యటన చేశారు. నాలుగు రోజుల పాటు తాజ్ మహల్, అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసానికి వెళ్లి అతిథిగా పిలిచిన విందులో పాల్గొన్నారు. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్‌లో ఉషా వాన్స్ మాట్లాడారు. భారత్ పర్యటన గురించి మాట్లాడుతూ… ‘‘జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం ఇది. పిల్లలు తొలిసారిగా భారతదేశానికి రావడం, భారతీయ ఆహారం, సంప్రదాయాన్ని ఆస్వాదించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది’’ అని చెప్పారు.
Youtuber: మరో ఇండియన్ యూట్యూబర్ అరెస్ట్.. ఈ సారి టర్కీలో
ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యం గురించి చెప్పిన ఉషా వాన్స్, ‘‘మోడీగారు మా పిల్లలతో తాతలా మమేకమయ్యారు. రామాయణం కథను చిన్న చిన్న బొమ్మల ప్రదర్శనలతో వివరించారు. ముగ్గురికీ నెమలి ఈకల బహుమతిని అందించారు. మిరాబెల్ ఈకను ప్రేమగా పట్టుకుని, ఆనందంగా ఆస్వాదించింది’’ అని వివరించారు. పిల్లల అనుభవాలను షేర్ చేస్తూ… ‘‘పెద్ద కుమారుడు ఇవాన్ ఆలయాల్లోని శిల్పాలకు ఆకర్షితుడయ్యాడు. చిన్న కుమారుడు వివేక్ ఏనుగులు, ఒంటెలు, నెమళ్లను చూసి ఆశ్చర్యపోయాడు. మా కుమార్తెకు ఆటో రిక్షాలో ప్రయాణించడం చాలా నచ్చింది’’ అని చెప్పారు.
పర్యటనలో వారంతా తాజ్‌మహల్, జైపూర్ అంబర్ కోట, అక్షరధామ్ ఆలయం, కేంద్ర హస్తకళల ఎంపోరియంలను సందర్శించారు. భారతీయ వంటకాలను ఆస్వాదించారు. ఈ పర్యటన మరచిపోలేనిదిగా ఉందని ఉషా వాన్స్ తెలిపారు. మరోసారి భారత్‌కు రావాలనే ఆసక్తి ఉందని చెప్పారు.
Shocking : మహిళా సెక్స్ వర్కర్లలో టాప్ 5లో తెలుగు రాష్ట్రాలు.. ఏపీ రెండో స్థానం.. తెలంగాణ…?