USA Drone: రష్యాదే తప్పు… సాక్షాలతో సహా వీడియో విడుదల చేసిన అమెరికా!

నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేయడంపై గత రెండు రోజులుగా అమెరికా రష్యా దేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే తప్పు మీది అంటే మీది అంటూ అమెరికా రష్యా పెద్ద ఎత్తున మాటల యుద్ధం చేస్తుంది.

  • Written By:
  • Publish Date - March 16, 2023 / 09:47 PM IST

USA Drone: నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్ కూల్చివేయడంపై గత రెండు రోజులుగా అమెరికా రష్యా దేశాల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలోనే తప్పు మీది అంటే మీది అంటూ అమెరికా రష్యా పెద్ద ఎత్తున మాటల యుద్ధం చేస్తుంది. అయితే చివరికి అమెరికా సాక్షాలతో సహా నిఘా డ్రోన్ కూల్చివేయడానికి సంబంధించిన వీడియోలను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వీడియోలో భాగంగా వేగంగా దూసుకెళ్తున్న ఫైటర్ జెట్ నుంచి ఒక్కసారిగా ఇంధనం బయటకు వచ్చినట్లు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఈమేరకు అమెరికా యూరోపియన్ కమాండ్ అధికారక ట్విట్టర్ ద్వారా ఒక వీడియోని షేర్ చేసారు. రష్యాకు చెందిన ఎస్ యూ 27 జెట్ విమానం అమెరికాకు చెందిన ఎం క్యూ 9 పై ఇంధనం చల్లింది. ఇలా కొన్ని సెకండ్ల వ్యవధి తర్వాత రష్యాకు చెందిన మరొక జెట్ ఇంధనాన్ని మరో డ్రోన్ పై చల్లింది. ఇలా ఇంధనం చల్లిన తర్వాత నేరుగా రష్యన్ జెట్ ప్రొఫైలర్ ను ఢీకొట్టడంతో నిఘాడ్రోన్ కూలిపోయిందని యూఎస్ యూరోపియన్ కమాండ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

అదేవిధంగా అమెరికా నిఘా డ్రోన్ పై రష్యన్ జెట్ ఉద్దేశపూర్వకంగానే ఇంధనం చల్లి డీ కొట్టిందని అమెరికా మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన చూస్తుంటే రష్యా నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం అని తెలిపారు. ఇలా నిఘా డ్రోన్ ఢీకొట్టడానికి ముందు రష్యా జెట్ ఎస్ యూ 27 అనేకసార్లు ఇంధనాన్ని చెల్లింది.ఎం క్యూ 9 కి అతి సమీపంగా రావడమే కాకుండా ఇంధనాన్ని విడుదల చేస్తూ వాతావరణ కాలుష్యానికి కారణమైందంటూ అమెరికా మిలిటరీ తెలిపారు. అయితే అమెరికా మిలిటరీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలను రష్యా ఖండించింది. డ్రోన్ ఎం క్యూ 9 నియంత్రణ కోల్పోయి ఎస్ యూ 27 ప్రయాణిస్తున్న మార్గంలోకి చొచ్చుకొని రావడమే కాకుండా జెట్ ను ఢీ కొట్టి సముద్రంలో కూలిపోయిందని రష్యా వెల్లడించింది. అంతేకాకుండా ఈ ఘటనలో రష్యా ఎలాంటి ఆయుధాలను కూడా ఉపయోగించలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.