Flesh Eating Bacteria: మాంసం తినే బ్యాక్టీరియా.. దాని బారిన పడ్డారో.. ఆశలు వదులుకోవాల్సిందే?

ఏంటి మాంసం తినే బ్యాక్టీరియానా అంటూ షాక్ అవుతున్నారా! మీరు విన్నది నిజమే. ఈ రకమైన బ్యాక్టీరియా యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 04:14 PM IST

ఏంటి మాంసం తినే బ్యాక్టీరియానా అంటూ షాక్ అవుతున్నారా! మీరు విన్నది నిజమే. ఈ రకమైన బ్యాక్టీరియా యూఎస్‌లోని తూర్పు తీర వెంబడి సముద్ర జలాల్లో ఉంటుంది. ఇది విబ్రియో వల్నిఫికస్ అనే ప్రాణాంతక గాయాల ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్లు నెక్రోటైజింగ్ ఫాసిటిస్‌కు దారితీస్తుంది. దీంతో ఓపెన్‌ గాయం చుట్టూ మాంసం కుళ్లపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే మాంసం తినే బ్యాక్టీరియాగా కూడా చెబుతారు. ఈ నైక్రోటైజింగ్‌ ఫాసిటస్‌ అనేది ఒకటికంటే ఎక్కువ రకాల బ్యాక్టీరియాల వల్ల సంభవిస్తుంది. దీని బారిన పడిన కేసుల్లో చాలావరకు ప్రాణాలు కోల్పోయే అవకాశం గానీ అవయవాన్ని కోల్పోయే ప్రమాదం గానీ ఉంటుందట.

ఇలాంటి ఇన్ఫెక్షన్‌ బారిన జెన్నిఫర్‌ బార్లో అనే అట్లాంట మహిళ పడి మరణం అంచుల వరకు వెళ్లొచ్చింది. జెన్నిఫర్‌ బార్లో అనే 33 ఏళ్ళ మహిళ యూఎస్‌లోని బహామాస్‌ పర్యటనలో ఉన్నప్పుడు సముద్రపు నీరు కారణంగా చిన్నపాటి గాయం అయ్యింది. చాలా చిన్ననీళ్ల ఒరిపిడి గాయం. అదికాస్త పెద్దదిగా అయ్యి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్‌కి గురవ్వుతుందని ఊహించలేదు. అయితే బార్లో కూడా పెద్ద గాయం కాదనే అనుకుంది. చిన్న పాటి క్రీమ్‌లు వంటివి రాసి గాయం పెద్దది కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంది. తగ్గిపోతుందనుకుంటే రోజు రోజుకి పెరుగుతుందేంటి అని ఆశ్చర్యపోయింది. చిన్న గాయం ఏదో పెద్ద రాడ్‌తో కొట్టినట్ల, లేదా పడిపోతే తగిలిన గాయం మాదిరిగా ఇంత నొప్పి వస్తోందేంటి అని కూడా అనుకుంది.

ఆ నొప్పి భరించలేక ఒకరోజు తన నివాసంలోనే హఠాత్తుగా స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. ఇది గమనించిన ఆమె సోదరుడు వెంటనే ఆస్పత్రికి హుటాహుటినా తరలించాడు. అక్కడ వైద్యుల ఆమె సెప్టిక్‌ షాక్‌తో బాధపడుతున్నట్లు నిర్థారించారు. కాలు బాగా వాచిపోయి నొప్పిగా ఉండటమే కాకుండా అక్కడ చర్మం అంతా వేడిగా ఉంది. బ్యాక్టీరియా ఆమె రక్త ప్రవాహంలో ప్రవేశించడంతో బార్లో సుమారు రెండు వారాల పాటు కోమాలోనే ఉండిపోయింది. ఆమె కిడ్నీ, లివర్‌ ఫెయిల్‌ అయిన లక్షణాలు కనిపించాయి. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కూడా ఎదురైంది. వైద్యులు కూడా ఆమె దీని నుంచి ఆరోగ్యంతో బయటపడదనే భావించారు. ఆశలన్ని వదిలేసి మరీ తమ వంతు ప్రయత్నంగానే వైద్యులు ఆమెకు చికిత్స చేయడం ప్రారంభించారు.

ఆమె తొడలో చనిపోయిన కణజాలాన్ని తొలగించడానికి ఏకంగా 12 సర్జరీలు చేశారు. ఆమె కాలును తొలగించకుండానే నయం అయ్యేలా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమి లేక వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించారు. ప్రస్తుతం ఆమె కాలు లేకుండా ఎలా దైనందిన జీవితాన్ని లీడ్‌ చేయాలో నేర్చుకునే పనిలో పడింది. అంతేగాదు ఈ గాయం కారణంగా కాలుని తొలగించకుండా ఉండేలా తొడలోని కణజాలన్ని తొలగించేందుకు గానూ సుమారు 30కి పైగా సర్జరీలు చేయించుకున్నప్పటికీ కాలు కోల్పోక తప్పలేదు.