US University Admissions : అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జాతి (Race) ఆధారంగా యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ కు అడ్మిషన్లను కల్పించడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. జాతిని ఇలా ప్రతికూలంగా ఉపయోగించకూడదని, దాన్ని అడ్మిషన్ల ప్రక్రియ నుంచి తొలగించాల్సిన అవసరం వచ్చిందని వ్యాఖ్యానించింది. హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలలో అడ్మిషన్లకు సంబంధించిన కేసును విచారించే క్రమంలో ఈమేరకు తీర్పును అమెరికా సుప్రీంకోర్టు వినిపించింది. జాతి ఆధారిత అడ్మిషన్ల ప్రక్రియల వంటి పద్ధతులను ఖచ్చితంగాపునస్సమీక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Also read : Group 4 Exam Instructions: రేపే గ్రూప్ 4 పరీక్ష.. ఈ సూచనలు మరిచిపోవద్దు..!
కళాశాల క్యాంపస్‌లలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా ఉపయోగించే జాతి ఆధారిత అడ్మిషన్ ప్రోగ్రామ్స్ ను చెల్లుబాటు కాకుండా చేసింది. “ఆ రెండు యూనివర్సిటీల అడ్మిషన్ల ప్రక్రియలు సదుద్దేశంతోనే ఉన్నప్పటికీ.. ఆ పద్ధతులు ఏ రకంగా చూసినా ప్రయోజనాలను ఇవ్వడం లేదు.. దరఖాస్తుదారుడు తెల్లవాడా, నల్లవాడా అనేదాని ఆధారంగా అడ్మిషన్ ను నిర్ణయించడం జాతి వివక్ష.. అలాంటి ఎంపిక ప్రక్రియను(US University Admissions) మన రాజ్యాంగ చరిత్ర సహించదు” అని రాబర్ట్స్ రాశారు. జాతి (Race) ఆధారంగా యూనివర్సిటీల్లో స్టూడెంట్స్ కు అడ్మిషన్లను కల్పించడం అమెరికాలో 1960లలోమొదలైంది.