Black Hole: కృష్ణబిలం ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన నాసా.. వైరల్ వీడియో?

అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం కృష్ణబిలం ఆయువు తీరిన తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఇది సెకనుకు దాదాపుగా

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 09:00 AM IST

అనంత గురుత్వాకర్షణ శక్తి కేంద్రం కృష్ణబిలం ఆయువు తీరిన తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఇది సెకనుకు దాదాపుగా మూడు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. దాంతో పాటుగా సర్వాన్ని శాశ్వతంగా తనలోకి లాక్కుంటుంది. అలాగే దాని గుండా కాంతి కూడా ప్రసరించలేదు గనక కృష్ణబిలం ఎలా ఉంటుందో మనం చూసే అవకాశం లేదు. కృష్ణబిలం బ్లాక్ హోల్ అనికూడా అంటారు. అలాంటి కృష్ణబిలం నాసా శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తొలిసారి వినిపించింది.

కాగా ఇందుకోసం 2003లో సేకరించిన ఒక కృష్ణబిలం తాలూకు డేటాకు శాస్త్రీయ పద్ధతిలోనే నాసా శబ్ద రూపం ఇచ్చింది. దాని కేంద్రం నుంచి అన్నివైపులకూ ఊహాతీతమైన వేగంతో నిత్యం వెలువడే అతి తీవ్రమైన ఒత్తిడి తరంగాలను శబ్ద రూపంలోకి మార్చి విడుదల చేసింది. ఇందుకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఇప్పటివరకు ఈ వీడియోని కొన్ని లక్షల మంది చూసారు. కాగా శబ్దం శూన్యంలో ప్రయాణించడు అన్న విషయం తెలిసిందే.

కానీ పాలపుంతల సమూహాల్లో అపారమైన వాయువులు ఉంటాయి. వాటిగుండా ప్రయాణించే కృష్ణబిలపు ఒత్తిడి తరంగాలకు నాసా తాలూకు చంద్ర అబ్జర్వేటరీ స్వర రూపమిచ్చింది. ఈ శబ్దం అచ్చం హారర్‌ సినిమాల్లో నేపథ్య సంగీతం మాదిరిగా హూం అంటూ ఒక వీడియోని వినిపిస్తోంది. నాసా విడుదల చేసిన వీడియోలో దీన్ని స్పష్టంగా వినవచ్చు.