Monkeypox Case: అమెరికాలో తొలి మంకీపాక్స్….ఆ దేశాల్లో ఎక్కువ కేసులు..!!

అమెరికాలో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది.

  • Written By:
  • Publish Date - May 19, 2022 / 10:30 AM IST

అమెరికాలో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసును ఆ దేశ అంటు వ్యాధుల సంస్థ CDC ధ్రువీక‌రించింది. మాసాచుసెట్స్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. అయితే ఆ వ్యక్తి ఈ మధ్యే కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల కొద్దీ ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ సీరియస్ వైరస్ కేసునుగా భావిస్తున్నారు. ఇక ఈ వ్యాధి ఫ్లూ లాంటి లక్షణాలతో అస్వస్థత ప్రారంభం అవుతుంది. జ్వరం, ఒళ్లు నొప్పులు, శరీరంపై మచ్చలు వ్యాపిస్తాయి.

మాంట్రియాల్లో ఆరోగ్యశాఖ అధికారులు 13 మంకీపాక్స్ కేసులను విచారిస్తున్నారు. శరీర ద్రవాలు కలవడం వల్ల మంకీపాక్స వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి శరీరాన్ని తాకితే ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దుస్తులు వెసుకున్న ప్రబలే ఛాన్స్ ఉంది. ఈ మధ్యే యూరప్ లోనూ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. పోర్చుగల్, స్పెయిన్, బ్రిటన్ లో ఈ కేసుల్ని ఎక్కువగా గుర్తించారు. ఇక ఈ వ్యాధి సెక్స్ వర్కర్స్ ద్వారా ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.