Site icon HashtagU Telugu

The Beast Car : జీ 20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న జో బైడెన్ ‘ది బీస్ట్‌’ కారు

us president joe biden car the beast features

us president joe biden car the beast features

దేశ రాజ‌ధాని ఢిల్లీ (New Delhi)లో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 స‌ద‌స్సు (G20 Summit 2023 )ను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ స‌ద‌స్సుకు ప్ర‌పంచ దేశాల అధినేత‌లు హాజ‌రు కానున్నారు. భారతదేశానికి గర్వకారణం జీ 20 సదస్సు అని.. భారత్ కి నాయకత్వాన జరిగే ఈ సదస్సు ప్రపంచానికి దిశా నిర్దేశం చేస్తుందని, ఇది అరుదైన అద్భుతమైన అవకాశం అని బీజేపీ (BJP) కొద్దీ రోజులుగా గొప్పగా చెపుతూ వస్తుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం చేశారు. కేంద్రం భద్రతా సిబ్బందిని, సాంకేతికత నిఘాను పటిష్ఠంగా ఏర్పాటు చేసింది. అయితే ఆయా దేశాల నేతలు భారత్ అందించే భద్రతతో పాటు సొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసుకుంటారు.

ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden) ప్రయాణించే కారు ‘ది బీస్ట్‌’ (The Beast) ఈ సదస్సు లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సెప్టెంబర్ 7వ తేదీన భారత్‌కు రానున్న జో బైడెన్ 8 వ తేదీన ప్రధాని మోడీ (PM Modi) తో ద్వైపాక్షిక భేటీ కానున్నారు. బైడెన్ ఆకాశంలో ప్రయాణించేందుకు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంతో పాటు హెలికాప్టర్లను ఉపయోగిస్తారు. ఇక రోడ్డుపై ప్రయాణించేందుకు ది బీస్ట్‌ను వాడతారు.

“ది బీస్ట్” కారు ప్రత్యేకతలు చూస్తే (Joe Biden Car The Beast Features).. ఈ కారు ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఆపత్కాళంలో టియర్ గ్యాస్ ని విడుదల చేసే అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఈ కారు సొంతం. ఇంకా ఈ కారులో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

పేలుడు పదార్థాలు, బుల్లెట్లను తట్టుకునే బుల్లెట్ ఫ్రూఫ్ రక్షితమైన రవాణా సాధనంగా “ది బీస్ట్”ను కాడిలాక్ తయారు చేసింది. ఈ కారు సాయుధ లిమోసిన్ మోడల్. దీనిలోని అసాధారణ భద్రతా ఫీచర్లతో పోలిస్తే ఇతర వాహనాల కంటే ఈ భద్రతా కారు విభన్నంగా ఉంటుంది.

ఇక ‘ది బీస్ట్’ బయటి భాగంలో 5 అంగుళాల మందంతో మిలిటరీ-గ్రేడ్ కవచం ఉంటుంది. అలాగే కారు డోర్లు 8 అంగుళాల మందంతో ఉండనున్నాయి. ఈ వాహనం మొత్తం బరువు బోయింగ్ 757 జెట్ క్యాబిన్ డోర్‌తో సమానంగా ఉండనుంది. ఈ కారు తలుపులు మూసుకున్న తర్వాత అందులోకి కనీసం గాలి కూడా చొరబడదు. ఈ విధంగా రసాయన దాడులను సైతం ఈ కారు తట్టుకోగలదు.

Read Also : KTR In UAE: దుబాయ్ లో మగ్గుతున్న తెలంగాణ ఖైదీలు.. కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు

అలాగే ఈ కారు కిటికీలు ఒకే సైజులో ఉండి.. గాజు, పాలికార్బోనేట్ ఐదు పొరలతో ఉంటుంది. బుల్లెట్ షాట్లను సులువుగా తట్టుకోగల శక్తి వీటికి ఉంది. బాంబు దాడులను సైతం తట్టుకునేలా ఈ కారును తయారుచేసారు. అంతే కాకుండా అదనపు స్టీల్ ప్లేట్లతో దీని ఛాసిస్‌ని బలంగా తయారు చేశారు. దాడి లేదా పేలుడు వల్ల టైర్లు దెబ్బతీసినప్పుడు, కారు డ్రైవింగ్ కొనసాగించే సామర్థ్యం ఈ కారుకి ఉంటుంది.

‘ది బీస్ట్’లో నలుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. దీనిలో ప్రతి ఒక్కరికోసం సపరేట్ గ్లాస్ పార్టిషన్‌ కూడా ఉంది. ఈ కారు స్విచ్ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఈ ప్రత్యేక స్విచ్ అధ్యక్షుడి నియంత్రణలో మాత్రమే ఉంటుంది. దీనితో ఆయన అదనపు గోప్యత, భద్రతకు సంబంధించిన తగిన సూచనలను చేస్తారు. ఈ ఫీచర్లతో పాటు, వాహనం ట్రంక్‌లో అగ్నిమాపక వ్యవస్థ కూడా ఉండడం మరో విశేషం.

Read Also : Shiva Movie : నాగార్జున శివ మూవీ ఏఎన్నార్‌కి నచ్చలేదట.. అసలు ఆ కథ ఎలా ఒకే చేశావు అంటూ..

ఇక ఈ బీస్ట్‌ కారును సాధారణ డ్రైవర్లు నడపలేరు. బీస్ట్‌ డ్రైవర్‌కు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ శిక్షణ ఇస్తుంది. ఇందులో ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తితే అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే దానిపై కూడా ట్రైనింగ్‌ ఇస్తారు. ప్రతీ రోజు బీస్ట్ డ్రైవర్‌కు మెడికల్ టెస్టులు చేస్తారు. ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే 180 డిగ్రీల ‘జె టర్న్‌’తో కారును తప్పించేలా డ్రైవర్‌కు ట్రైనింగ్ ఇస్తారు.