Site icon HashtagU Telugu

TikTok: టిక్ టాక్ చైనా స్పై వేర్.. దాన్ని ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించాలి : అమెరికా

Tiktokr

Tiktokr

టిక్ టాక్ యాప్ పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. దాన్ని చైనా స్పై వేర్ గా అభివర్ణించింది. వెంటనే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించాలంతో గూగుల్, యాపిల్ కంపెనీలకు లేఖలు రాసింది. అమెరికా ప్రభుత్వ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్ సీ సీ) కమిషనర్ బ్రెండెన్ క్యార్ ఈ లేఖను పంపారు.

టిక్ టాక్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న అమెరికన్ల ఫోన్లోని వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వం బీజింగ్ నుంచి చూసే వీలుందని ఆయన ఆరోపించారు. ఇది అమెరికా దేశ భద్రతతో ముడిపడిన అంశమని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో టిక్ టాక్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ల నుంచి తొలగించాల్సిన బాధ్యత ఆయా కంపెనీలపై ఉందని క్యార్ అభిప్రాయపడ్డారు. ఈమేరకు వివరాలతో కూడిన సుదీర్ఘ లేఖను ఆయన విడుదల చేశారు.

దాన్ని ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు. జులై8లోగా తమకు వివరణ ఇవ్వాలని కూడా ఆ కంపెనీలను కోరారు. వినియోగదారుల ప్రైవసీకి భద్రత కల్పించే దిశగా నిర్ణయం తీసుకోవాలని బ్రెండెన్ క్యార్ సూచించారు.

Exit mobile version