Chemical Weapons Big Announcement : రసాయన ఆయుధాలు(కెమికల్ వెపన్స్) ప్రాణాంతకం..
వీటి నిర్మూలన దిశగా అమెరికా చొరవ చూపింది..
తమ దగ్గరున్న రసాయన ఆయుధాలను నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
1997లో అమెరికా సెనేట్ ఆమోదించిన రసాయన ఆయుధాల కన్వెన్షన్‌లో భాగంగా రసాయన ఆయుధాల నిల్వను నాశనం చేశామని ఆయన వెల్లడించారు.
ఇంతకీ ఏమిటీ రసాయన ఆయుధాలు ?
Also read : Covid Relief Fraud: అమెరికాలో రూ.438 కోట్లు స్వాహా.. 10 మంది భారతీయులు సహా 14 మంది అరెస్టు
రసాయన ఆయుధాలు(Chemical weapon) అనేవి విష పదార్థాలు. వీటిని ఫిరంగి గుండ్లు లేదా గ్రెనేడ్‌లలో కలిపి శత్రువులపై ప్రయోగిస్తారు. ఇవి పేలిన వెంటనే వెలువడే విషపూరిత వాయువుల వల్ల అలర్జీ.. చికాకు.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర అవస్థ వంటివి కలుగుతాయి. ఆ వాసనకు మెదడు మొద్దుబారినట్టు అవుతుంది. శరీరం తీవ్రంగా కాలిపోతుంది. చర్మంలో మంట కలుగుతుంది. చివరకు మరణానికి కూడా దారి తీయొచ్చు. ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధం టైంలో ఇలాంటి కెమికల్ వెపన్స్ ను వినియోగించారు. వాటిని అప్పట్లోనే క్లోరిన్, ఫాస్జీన్ (ఊపిరాడకుండా చేస్తుంది), మస్టర్డ్ గ్యాస్ (చర్మం కాలిపోయేలా చేస్తుంది) వంటి డేంజరస్ రసాయనాలతో తయారు చేసేవారు. 2017లో సిరియన్ ప్రెసిడెంట్ బషర్-అల్-అస్సాద్ వైమానిక దళం, రష్యా ఆర్మీతో కలిసి విషపూరితమైన క్లోరిన్ బాంబులను పౌరులు నివసించే ప్రాంతాలపై జారవిడిచింది. ఫలితంగా వేలాది మంది చనిపోయారు. అయితే తాము క్లోరిన్ బాంబులను వినియోగించినట్టు బషర్-అల్-అస్సాద్ అంగీకరించలేదు. 2018లో KGB మాజీ అధికారి సెర్గీ స్క్రిపాల్, అతని కుమార్తె పై హత్యాయత్నానికి.. 2020లో రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ పై హత్యాయత్నానికి నోవిచోక్ (Novichok) అనే ప్రమాదకర కెమికల్ ను రష్యా సీక్రెట్ సర్వీస్ వాడిందనే ప్రచారం జరిగింది. కోల్డ్ వార్ నడిచినన్ని సంవత్సరాల పాటు అమెరికా, రష్యాల పెద్ద సంఖ్యలో కెమికల్ వెపన్స్ స్టాక్ ఉండేదని అంటారు.
Also read : Mukesh Ambani Diwali Gift : 36 లక్షల మంది షేర్ హోల్డర్లకు ముకేశ్ అంబానీ దీపావళి గిఫ్ట్!
జీవ ఆయుధాలు ఏమిటి ?
జీవ ఆయుధాలు(Biological warfare) అంటే.. వైరస్ లు, బాక్టీరియాలు లేదా ఇతర వ్యాధిని కలిగించే జీవులను రిలీజ్ చేసి వ్యాధులు కలిగేలా చేయడం. వరల్డ్ వార్ 1 టైంలో , ఆ తర్వాత చాలా దేశాలు ఆంత్రాక్స్, మశూచి, ప్లేగు వంటి వ్యాధులను వ్యాపించే జీవులతో బయో వెపన్స్ తయారు చేసేందుకు బోలెడు ప్రయోగాలు చేశాయని అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం టైంలో శత్రు దేశాల సైన్యాలకు చెందిన గుర్రాలు, పశువులకు వ్యాధులు కలగజేసే వైరస్‌లను జర్మనీ రిలీజ్ చేసిందని చెబుతారు. అప్పట్లోనే జపాన్ దేశం కొందరు యుద్ధ ఖైదీలపై బుబోనిక్ ప్లేగు, ఆంత్రాక్స్ వంటి బయో వెపన్స్ ను టెస్ట్ చేసిందని, ఈక్రమంలో అనేక మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారనే నివేదికలు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యాలు ఈ తరహా బయో వెపన్స్ పై పెద్దఎత్తున ప్రయోగాలు చేశాయి.