Site icon HashtagU Telugu

Monkeypox : అమెరికాని క‌ల‌వ‌ర‌పెడుతున్న మంకీపాక్స్‌.. ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌ట‌న‌

Monkeypox

Monkeypox

అమెరికాలో మంకీపాక్స్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 6,600 పైగా కేసులు న‌మోదైయ్యాయి. దీంతో అలెర్టైన అమెరికా మంకీపాక్స్‌ని ప‌బ్లిక్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్ర‌క‌టించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్ర‌క‌టించిన వారం త‌రువాత అమెరికా కూడా ప్ర‌కటించింది. మంకీపాక్స్ నియంత్రించ‌డానికి తాము సిద్ధంగా ఉన్నామని.. మంకీపాక్స్‌ను తీవ్రంగా పరిగణించాలని ప్రతి అమెరికన్‌ను కోరుతున్నామని ఆరోగ్య, మానవ సేవల విభాగం కార్యదర్శి జేవియర్ బెకెరా తెలిపారు. గురువారం నాటికి, US 6,600 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులను ధృవీకరించింది, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్త మొత్తం 25,800 లో దాదాపు 25 శాతం కేసులు ఇక్క‌డే న‌మోదైయ్యాయి. దేశంలో ధృవీకరించబడిన మంకీపాక్స్ కేసుల పరంగా మొదటి మూడు రాష్ట్రాలైన న్యూయార్క్, కాలిఫోర్నియా ఇల్లినాయిస్ ఉన్నాయి. న్యూయార్క్ నగరం, శాన్ ఫ్రాన్సిస్కో మరియు లాస్ ఏంజిల్స్‌తో సహా కొన్ని నగరాలు కూడా ఎమర్జెన్సీ ప్రకటనలను చేశాయి.

Exit mobile version