Site icon HashtagU Telugu

US Cleric Shot: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. మతపెద్దపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..!

US Cleric Shot

Shooting Chaos In America.. Attack With A Well Planned Plan!

US Cleric Shot: న్యూయార్క్‌లో బుధవారం మసీదు వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు మతపెద్దపై కాల్పులు (US Cleric Shot) జరిపిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడి అనంతరం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని చికిత్స నిమిత్తం ఆ ప్రాంతంలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వ్యక్తి మత గురువు అని, మసీదు వెలుపల ఈ ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. స్థానిక భద్రతా అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం.. బుధవారం ఉదయం ఒక వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

Also Read: Arvind Kejriwal: సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టు అవుతారా..? ఢిల్లీలో ఏం జరగబోతుంది..?

ఆ వ్యక్తి మత గురువు అని, మసీదు వెలుపల ఈ ఘటన జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికాలో ఇస్లామోఫోబిక్- సెమిటిక్ వ్యతిరేక దాడులు పెరిగాయి. కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (CAIR) న్యూజెర్సీ చాప్టర్ ప్రచురించిన ఫోటోలు మసీదు వెలుపల పోలీసు వాహనాలను మోహరించినట్లు చూపించాయి. CAIR న్యూజెర్సీ కమ్యూనికేషన్స్ మేనేజర్ దీనా సయీధామెద్ మాట్లాడుతూ.. “మేము ఈ సంఘటన పట్ల చాలా ఆందోళన చెందుతున్నాం. మత గురువు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. కాల్పుల గురించి ఎవరైనా సమాచారం ఉన్నవారు వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలి.” అని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.