Site icon HashtagU Telugu

UPSC : సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..

UPSC Civil Services 2023 Final results release

UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్‌ ప్రదాన్‌ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహ‌నీకి వ‌చ్చింది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేర్లు మరియు రూల్ నంబర్‌లను UPSC విడుదల చేసింది.

UPSC సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..

దోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షయ్‌ దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్‌ కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830, జె. రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకుల్లో మెరిశారు.

We’re now on WhatsApp. Click to Join.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1105 ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది మే 28న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షను క్లియర్‌ చేసిన వారికి సెప్టెంబర్‌ 15, 16, 17, 23, 24 తేదీల్లో రెండు షిఫ్టుల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి.. డిసెంబర్‌ 8న మెయిన్స్‌ ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఏప్రిల్‌ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 1016 మందిని యూపీఎస్సీ(UPSC) ఎంపిక చేయగా.. ఇందులో జనరల్‌ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ కేటగిరీలో 165 , ఎస్టీ కేటగిరీలో 86 మంది చొప్పున ఎంపికయ్యారు.

Read Also: Lok Sabha Elections : రేవంత్ ఫై మళ్లీ అలాగే కామెంట్స్ చేసిన కేటీఆర్..

కాగా, సెప్టెంబర్ 2023లో UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 యొక్క వ్రాతపూర్వక భాగం ఫలితాలు మరియు జనవరి నుండి ఏప్రిల్ 2024 వరకు జరిగిన పర్సనాలిటీ టెస్ట్ కోసం తదుపరి ఇంటర్వ్యూల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేయబడింది. ఈ జాబితాలో అభ్యర్థులు సిఫార్సు చేయబడిన వారు ఉన్నారు (1) ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు నియామకం; (2) ఇండియన్ ఫారిన్ సర్వీస్; (3) ఇండియన్ పోలీస్ సర్వీస్; మరియు (4) సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ ‘ఎ’ మరియు గ్రూప్ ‘బి’.

Read Also: Telangana BJP : తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగిందంటున్న సర్వేలు..

CSE (మెయిన్స్) సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబరు 24 వరకు రెండు షిఫ్ట్‌లలో సబ్జెక్టివ్ ఫార్మాట్‌లో జరిగింది. ప్రతి షిఫ్ట్, మూడు గంటల పాటు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించబడింది. .