Site icon HashtagU Telugu

Bridge School: మురికవాడ పిల్లల్లో విద్యా వెలుగులు!

Bridge School

Bridge School

పిల్లల భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని నమ్మాడు యువకుడు. తనకొచ్చిన ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టాడు. ఓ బ్రిడ్జినే పాఠశాలగా మార్చి మురికివాడ పిల్లల్లో విద్యా సుగుంధాలు పూయిస్తున్నాడు. ఒకరు కాదు.. ఇద్దరు దాదాపు 150 మంది పిల్లలకు ఉచితంగా విద్యను భోదిస్తూ.. ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాడు.

ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలో ప్రతిరోజూ దాదాపు 150 మంది విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు వస్తుంటారు. ఎలాంటి ఫీజులు లేకుండానే వాళ్లందరికీ ఉచితంగా విద్యాభోదన జరుగుతుంది. కొంతమంది పేద పిల్లలకు కంప్యూటర్లు, ట్యాబ్ లు లేక ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్నారు. అలాంటివాళ్లకు కూడా ఇక్కడ ఫ్రీ టీచింగ్ జరుగుతుంది. బదౌన్‌లో జన్మించిన నరేష్ పాల్ వల్లే ఇదంతా సాధ్యమైంది. పెద్దయ్యాక.. తన తల్లిదండ్రులు ఇద్దరు రైతులు. వచ్చే సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. దీంతో నరేష్ చదువుకునేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు.

కాలేజీకి వెళ్లేటప్పటికి చదువుకు డబ్బుల కోసం ప్రైవేట్ ట్యూషన్లు చెప్పాల్సిన పరిస్థితి. అప్పుడే తనలాంటి పిల్లలకు ఉచితంగా విద్యాబోధన అందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న వెంటనే నరేష్ గత 10 సంవత్సరాలుగా యమునా నది ఒడ్డున నివసించే పిల్లలకు పాఠాలు చెబుతుండగా.. COVID-19 లాక్‌డౌన్‌ల కారణంగా ‘వంతెన కింద ఉచిత పాఠశాల’ ఏర్పాటు చేశాడు. ఒకవైపు UPSC పరీక్షలకు సిద్ధమవుతూనే.. మరోవైపు పిల్లలకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు. పాఠశాలకు పైకప్పు, గోడలు, బల్లలు, కుర్చీలు కూడా లేవు. దీంతో నరేష్ ప్రయత్నం మెచ్చి కొంతమంది విరాళాలు అందించారు. వాళ్లు ఇచ్చిన విరాళాలతో పిల్లలకు టాయిలెట్ పాటు స్టేసనరీ సదుపాయం కల్పించాడు.

Exit mobile version