మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అరబ్ దేశాలు ఖండించాయి. ఖతర్, ఇరాన్, కువైట్ దేశాలు…భారత దౌత్య కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశాయి. ముస్లిం దేశాలు ఒకదాని వెనక మరొకటి నుపూర్ శర్మ వ్యాఖ్యలను విమర్శిస్తున్నాయి. ఈ జాబితోకి అప్ఘానిస్తాన్ కూడా చేరింది. మూఢులపై ఇప్పుడు తాలిబన్లు కూడా భారత్ సుద్ధులు చెప్పేస్తున్నాయి.
నుపూర్ శర్మ వ్యాఖ్యలను తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఖండించారు. మూఢులు పవిత్రమైన ఇస్లాం మతాన్ని అవమానించే విధంగా అవకాశం భారత్ ఇవ్వకూడదని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం మనోభావాలను రెచ్చగొట్టే స్వేచ్చ ఇవ్వొదన్నారు. భారత్ లో అధికార పార్టీ నేత ఇస్లాం ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ తీవ్రంగా ఖండిస్తుందన్న ట్వీట్టర్ లో పేర్కొన్నాడు. ఇక పాకిప్తాన్ ప్రధానికగా కొత్తగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు.
The Islamic Emirate of Afghanistan strongly condemns the use of derogatory words against the Prophet of Islam (Peace be upon him)by an official of the ruling party in India. 1/2
— Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) June 6, 2022