Site icon HashtagU Telugu

UPI Services : ఎన్ఆర్ఐ లకు సైతం యూపీఐ సేవలు..!

UPI services for NRIs too.

Upi

భారత సంతతి వ్యక్తులు సైతం యూపీఐ సేవలను (UPI Services) ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించనున్నట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ప్రకటించింది. యూపీఐని అభివృద్ధి చేయడమే కాకుండా, దీని అమలు బాధ్యతలను చూస్తోంది ఈ సంస్థే. భారతీయ బ్యాంకుల్లో ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాలున్న వారు యూపీఐ ద్వారా చెల్లింపులు, నగదు సేవలను వినియోగించుకోవచ్చు. విదేశాల్లో ఉండే వారికి అక్కడి ఫోన్ నంబర్లు ఉంటాయి. ఆ ఫోన్ నంబర్లకు అనుసంధానమైన ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ వో ఖాతాలకు లింక్ చేసి, యూపీఐ సేవలను పొందొచ్చు. అంటే యూపీఐ సేవల కోసం భారతీయ సిమ్ కార్డు అవసరం లేదు. సింగపూర్, అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, ఒమన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, హాంగ్ కాంగ్ దేశాల్లో ఉండే వారికి ఈ అవకాశం అందుబాటులోకి వస్తుంది. ఈ దేశాల్లోని భారత సంతతి వారు ఎన్ఆర్ఈ ఖాతాను, ఈ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఎన్ఆర్ వో ఖాతాను తెరిచి, వాటితో యూపీఐ సేవలు (UPI Services) పొందొచ్చు. మరో యూపీఐ యూజర్ కు నగదు బదిలీ, చెల్లింపుల సేవలను చేసుకోవచ్చు.

Also Read:  Free Benz Car: ఉద్యోగులకు బెంజ్ కార్ ఆఫర్.. స్టార్టప్ క్రేజీ ఐడియా..