Apollo Hospitals Chairman : ప్రమాదానికి గురైన ఉపాసన తాత

చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకురాగా ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Apollo Hospitals Chairman Prathap Reddy

Apollo Hospitals Chairman Prathap Reddy

అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ( Apollo Hospitals Chairman ) ప్రతాప్ రెడ్డి (Prathap C Reddy) ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. చెన్నైలో ఓ వ్యాన్ ప్రతాప్ రెడ్డి కారుపైకి దూసుకురాగా ఆయన త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై చెన్నైలో కేసు నమోదైంది. ఈ ప్రమాదానికి సంబదించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, రామ్ చరణ్ భార్య ఉపాసనకు ప్రతాప్ రెడ్డి తాత అవుతారు. ప్రస్తుతం ఉపాసన అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రతాప్ చంద్ర రెడ్డి విషయానికి వస్తే.. భారతదేశంలోని మొదటి కార్పొరేట్ గొలుసు హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్స్‌ను స్థాపించాడు. ఈయన చెన్నైలోని స్టాన్లీ మెడికల్ కాలేజీ నుండి మెడికల్ డిగ్రీని పొందారు మరియు UK మరియు USA లలో కార్డియాలజిస్ట్‌గా శిక్షణ పొందారు. ప్రతాప్ రెడ్డి బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ నుండి తన ఫెలోషిప్ చేసాడు. అలాగే USAలోని మిస్సౌరీ స్టేట్ చెస్ట్ హాస్పిటల్‌లో అనేక పరిశోధన కార్యక్రమాలకు నాయకత్వం వహించాడు.

Read Also : World Leaders : మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రపంచ దేశాధినేతలు

  Last Updated: 06 Jun 2024, 02:36 PM IST